HDPP CONDUCTING FESTIVALS AS MANAGUDI PROGRAM _ఆగస్టు 20న వరలక్ష్మీ వ్రతం, 22న శ్రావణపౌర్ణమి, 30న శ్రీకృష్ణాష్టమి
Tirupati 9, August 2021: As part of the prestigious Managudi program, the HDPP wing of TTD is organising the festivals of Varalakshmi vratam, Shravana pournami and Sri Krishnaastami in the month of August.
The festivities will be held at chosen temples in the district headquarters of both the Telugu states on these dates with limited devotees and as per Covid guidelines.
As part of the Managudi program, the Varalakshmi vratam is conducted by Archakas in the temples on August 20 followed by bhajan programs on August 21.
On the occasion of Shravana Pournami on, August 22, pundits will conduct a dharmic upanyasam and Bhakti sangeet program. Similarly, on August 30, Go-puja and Utti utsava will be observed on August 30 in the same temples as part of Srikrishnastami festivities.
The HDPP will conduct these activities in all temples as programmed above in coordination with other TTD dharmic projects.
తెలుగు రాష్ట్రాల్లో మనగుడి ఆగస్టు 20న వరలక్ష్మీ వ్రతం, 22న శ్రావణపౌర్ణమి, 30న శ్రీకృష్ణాష్టమి
తిరుపతి, 2021 ఆగస్టు 09: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 20న వరలక్ష్మీ వ్రతం, 22న శ్రావణపౌర్ణమి, 30న శ్రీకృష్ణాష్టమి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన ఆలయాల్లో నిర్వహించనున్నారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో భక్తులతో ఈ కార్యక్రమాలు చేపడతారు.
ఆగస్టు 20న ఆయా ఆలయాల్లో అర్చకుల చేత వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగస్టు 21 ఆలయాల్లో భజన కార్యక్రమం చేపడతారు. ఆగస్టు 22న శ్రావణ పౌర్ణమి సందర్భంగా పండితుల చేత ధార్మికోపన్యాసం, భక్తి సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు. ఆగస్టు 30న శ్రీకృష్ణాష్టమినాడు ఆయా ఆలయాల్లో గోపూజ, ఉట్టి ఉత్సవం జరుపుతారు. హిందూ ధర్మప్రచారంలో భాగంగా టిటిడిలోని అన్ని ధార్మిక ప్రాజెక్టుల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.