TIRUMALA – ADI VARAHA KSHETRAM _ ఆదివరాహ క్షేత్రం తిరుమల క్షేత్రం

Tirumala,16 September 2024:  The Universal Supremo of Kaliyuga, Sri Venkateswara Swamy is residing in Tirumala with the  purpose of protecting His devotees across the globe in this aeon.
 
Puranic legends indicates that Sri Maha Vishnu after completing His divine task of eliminating the demons has taken abode on Venkatachala hills in the incarnation of Sweta Varaha (wild boar).
 
Since then, Tirumala has been tagged as ”Adi Varaha Kshetram” and devotees will have Sri Venkateswara Swamy darshan, only after paying visit to Sri Varaha Swamy temple.
 
Puranas says that Sri Varaha Swamy along with Sridevi and Bhudevi is residing on the west of Swamy Pushkarani signifiying an icon of prosperity and health to all. 
 
Swamy Pushkarini is called Varaha Pushkarani and this fresh water lake is ”Swayam Vyakta” (self-originated) and its importance is mentioned in many epics including Varaha-Markandeya-Vamana- Skanda- Brahma and Bhavishyottara Puranas. 
 
It is believed that all the three crore Thirthams are considered to have originated from Swamy Pushkarini Theertham only.
 
Upon the directions of Sri Varaha Swamy, the Swamy Pushkarini was brought by Garuda from Vaikuntha, the abode of Sri Maha Vishnu. 
 
Varaha Pushkarini has also become popular as Swami Pushkarani and is said to be home for nine sacred Thirthas namely Kubera Thirtham, Galava Thirtham, Markandeya Thirtham, Agni Thirtham, Yama Thirtham, Vashistha Thirtham, Varuna Thirtham, Vayu Thirtham and Saraswati Thirtham.
 
The ancient scriptures says that taking bath in this holy Swamy Pushkarini Thirtham would provide salvation.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 

2024 బ్రహ్మోత్సవాల ప్రత్యేకం

ఆదివరాహ క్షేత్రం తిరుమల క్షేత్రం

తిరుమల, 2024 సెప్టెంబ‌రు 16: కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి పరమపవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో వెలసి భక్తులను రక్షిస్తున్నాడు.

శ్రీ వేంకటేశ్వరుడు ఈ క్షేత్రంలో ఉండటానికి పూర్వమే శ్రీమన్నారాయణుడు శ్వేతవరాహరూపంతో అవతరించాడు. హిరణ్యాక్షుణ్ణి శ్రీమహావిష్ణువు వరాహావతారంలో సంహరించిన తర్వాత సాధుసంరక్షణ చేయడానికి భూలోకంలోనే ఉండటానికి అంగీకరించి వేంకటాచలం మీద తన నివాసం ఏర్పరచుకున్నాడు.

అప్పటినుండి ”ఆదివరాహక్షేత్రంగా” తిరుమల పిలువబడుచున్నది. అందువల్ల మొట్టమొదటి నైవేద్యం వరాహస్వామికి నివేదన చేస్తారు. సాధారణంగా ఈ క్షేత్రంలో మొదట వరాహస్వామిని దర్శించిన తరువాతే భక్తులు శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటారు.

వరాహపుష్కరిణి (స్వామి పుష్కరిణి) :

వేంకటాచలంలోని పుష్కరిణి మానవనిర్మితం కాదు, స్వయంవ్యక్తం. స్వామి పుష్కరిణి అనే ప్రసిద్ధి ఈ ఒక్క పుష్కరిణికే దక్కింది. దీని అసలు పేరు వరాహపుష్కరిణి. ఈ పుష్కరిణి గురించి వరాహ-మార్కండేయ వామన- స్కాంద – బ్రహ్మ – భవిష్యోత్తర పురాణాలు అభివర్ణిస్తున్నాయి.

వేంకటాచలంలో గల మూడుకోట్ల తీర్థాలకు స్వామి పుష్కరిణి అవతారస్థానమని ప్రసిద్ధి. దివ్య తేజోపేతం, సుగంధభరితమైన ఈ పుష్కరిణి సర్వతీర్థాలకు ఉత్పత్తి స్థానమని, శ్రీనివాసుడు వేంకటాద్రిపై అవతరించకముందే ఆవిర్భవించిందని వరాహపురాణం ప్రతిపాదిస్తున్నది.

వరాహస్వామి నివాసం స్వామిపుష్కరిణీ తటాన ఉండడంవల్ల, ఆయన ఆజ్ఞచే గరుడుడు దీన్ని వైకుంఠం నుండి తీసుకొనిరావడం చేత దీనికి ”వరాహపుష్కరిణి” అనే పేరు సంక్రమించింది.

ఈ పవిత్ర స్వామిపుష్కరిణిలో ”తొమ్మిది తీర్థాలు”న్నాయి. కుబేరతీర్థం, గాలవతీర్థం, మార్కండేయతీర్థం, అగ్నితీర్థం – యమతీర్థం, వశిష్ఠతీర్థం, వరుణతీర్థం, వాయుతీర్థం, సరస్వతీతీర్థం ప్రధానమైనవి.

ఒకేరోజున ఈ తొమ్మిది తీర్థాల్లో స్నానంచేసి స్వామిపుష్కరిణీ తీరంలో ఉన్న స్వామి వారిని దర్శిస్తే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అనేది భక్తుల నమ్మకం.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.