BETTER HYGIENE WITH ADVANCED TECHNOLOGY- TTD JEO(H&E) _ ఆధునిక టెక్నాల‌జీతో మ‌రింత మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌- టీటీడీ జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి‌

Tirupati, 06 November 2023: TTD JEO for Health and Education Smt Sada Bhargavi said action plans are being readied for adaptation of advanced technologies in maintaining hygiene and sanitation at Tirumala which receives tens of thousands of pilgrim footfalls every day.

Participating as chief guest at the one-day workshop on Shuddha Tirumala and Sundara Tirumala at SVETA Bhavan on Monday, she said the program is held in a continuous manner in order to protect the environmental balance in the hill town.

She said the focus of present workshop is to elicit expert opinions on promoting the hygiene and sanitation drive at TTD temples and buildings in Tirupati as well.

She appealed to the health workers and officials of TTD to utilise the proceedings of the workshop attended by environmental experts from all over the state.

Prominent spiritualist Sri Jonnalagadda Sriramamurthy, Swatcch Andhra corporation advisor Dr Jayaprakash Sai, Greater Visakhapatnam corporation additional municipal commissioner Dr Sanyasi Rao, Rajamundry municipal corporation behalf Sri JSR Annamaiah, Planet-wise Singapore founder Sri Anil Kumar, Tirupati municipal corporation superintendent Sri Ravi and others also spoke.

JEO also presented awards to 12 health workers of SVETA Bhavan who excelled in their performance and also felicitated the visiting environment experts.

TTD SE-2 Sri Jagadeeshwar Reddy, Health officer Dr Sridevi, SVETA Director Smt Prashanti, Additional health officer Dr Sunil Kumar were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆధునిక టెక్నాల‌జీతో మ‌రింత మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌

– టీటీడీ జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి

– శ్వేతలో శుద్ధ తిరుమ‌ల – సుంద‌ర తిరుమ‌ల‌పై వ‌ర్క్‌షాప్‌

తిరుపతి, 2023 నవంబరు 06: ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత హైంద‌వ ధార్మిక క్షేత్ర‌మైన తిరుమ‌ల‌కు ల‌క్ష‌లాది మంది భ‌క్తులు వ‌స్తుంటార‌ని, ఇందుకోసం ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో మ‌రింత మెరుగ్గా పారిశుద్ధ్య చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని టీటీడీ జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి తెలిపారు. తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో సోమ‌వారం శుద్ధ తిరుమ‌ల – సుంద‌ర తిరుమ‌ల కార్య‌క్ర‌మంపై ఒక‌రోజు వ‌ర్క్‌షాప్ జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం తిరుమ‌ల‌లో నిరంత‌రాయంగా శుద్ధ తిరుమ‌ల – సుంద‌ర తిరుమ‌ల కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌న్నారు. తిరుమ‌ల‌తోపాటు తిరుప‌తిలోని టీటీడీ సంస్థ‌ల వ‌ద్ద మ‌రింత మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ ఎలా చేప‌ట్టాల‌నే విష‌యంపై నిపుణుల సూచ‌న‌లు స్వీక‌రించేందుకు ఈ వ‌ర్క్‌షాప్ నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి నిపుణుల‌ను ఆహ్వానించిన‌ట్టు చెప్పారు. టీటీడీ ఆరోగ్య విభాగం అధికారులు, సిబ్బంది ఈ వ‌ర్క్‌షాప్‌ను సద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

అనంత‌రం ప్ర‌ముఖ ఆధ్యాత్మిక‌వేత్త శ్రీ జొన్న‌ల‌గ‌డ్డ శ్రీ‌రామ‌మూర్తి, స్వ‌చ్ఛ ఆంధ్ర కార్పొరేష‌న్ స‌ల‌హాదారు డా. జ‌య‌ప్ర‌కాష్ సాయి, గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం కార్పొరేష‌న్ అద‌న‌పు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ డా. వి.స‌న్యాసిరావు, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు చెందిన శ్రీ జెఎస్ఆర్‌.అన్న‌మ‌య్య‌, సింగ‌పూర్‌లోని ప్లానెట్‌వైజ్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు శ్రీ కె.అనిల్‌కుమార్‌, తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ సూప‌రింటెండెంట్ శ్రీ పి.ర‌వి త‌దిత‌రులు ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా శ్వేత భ‌వ‌నంలో మెరుగ్గా పారిశుద్ధ్య విధులు నిర్వ‌హించిన 12 మంది కార్మికుల‌ను జెఈవో స‌న్మానించి బ‌హుమ‌తులు అంద‌జేశారు. అతిథుల‌ను స‌త్క‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ శ్రీ‌దేవి, శ్వేత డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి, అద‌న‌పు ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.