SPREAD AYURVEDIC MEDICINE WORLDWIDE-TTD JEO (H&E)_ ఆయుర్వేదాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలి- జెఈవో శ్రీమతి సదా భార్గవి
AYURVEDA PARV-2023 SUMMIT BEGINS AT KACHCHAPI AUDITORIUM
RUMASAAP PAIN BALM LAUNCHED
Tirupati,27 October 2023: TTD JEO (Health and Education) Smt Sada Bhargavi said the ancient Indian medicine of Ayurveda had saved numerous lives during the Covid -19 season and called upon Ayurveda doctors on Friday to popularise the tenants of ancient Indian Ayurvedic medicine across the globe.
TTD JEO inaugurated the three-day convention of Ayurveda Parv 2023 organised jointly by TTD Sri Venkateswara Ayurveda College, Ayush Ministry and Akhila Bharat Ayurveda Maha Sammelan at the Kachchapi Auditorium.
Speaking on the occasion the TTD JEO said the Union government’s Ayush ministry had chosen the spiritual hub of Tirupati with the blessings of Sri Venkateswara to conduct the national convention to ensure that the benefits of Ayurveda reach the common man.
She said the Ayurveda medicinal procedures were the only known medicinal practices which identified the core ailment and solutions for complete cure.
She said the Seshachala forests the abode of Sri Venkateswara are a treasure trove of precious Ayurvedic medicinal plants and the Sri Srinivasa Ayurveda Pharmacy of TTD had indigenously formulated 30 medicines and has sent a proposal to the Ayush ministry for licenses to many more life-saving drugs.
She said TTD has initiated steps to improve infrastructure facilities at SV Ayurvedic Hospital and College after the demand for Ayurvedic treatment and medicines.TTD has introduced qualitative procedures after a tie-up with the Ayurvedic institutions in Kerala.
She also sought the support of the Ayush ministry towards the research and development activities at SV Ayurvedic College and other institutions.
RUMASAAP PAIN BALM UNVEILED
The JEO also launched the Rumasaap pain balm indigenously innovated by the researchers at the TTD-run Sri Srinivasa Ayurveda Pharmacy at Narasingapuram. She also unveiled the logo of the alumni association of SV Ayurveda College.
Earlier she also went around the exhibition put up by the Ayurveda college and Ayush department and others on the theme of Unani, Siddha and Homeopathy medical practices.
Ayush Ministry Joint Secretary Sri Biswajit Kumar Singh, Rashtriya Ayurveda Vidya peetham president Dr Devender Triguna, Ayush Advisor Dr Manoj Nesari, NCISM Chairman Dr Jayant Dio Pujari, SV Ayurveda College principal Dr Renu Dixit, faculty members Dr Vijaybhaskar Reddy, Dr Ramesh Babu, Dr Narappa Reddy, Dr Harshavardhan, Dr Shriharsha were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆయుర్వేదాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలి
– జెఈవో శ్రీమతి సదా భార్గవి
– కచ్చపి ఆడిటోరియంలో ఆయుర్వేద పర్వం -2023 ప్రారంభం
– రుమాశాప్ పెయిన్ బామ్ ఆవిష్కరణ
తిరుపతి, 2023 అక్టోబరు 27: భారతీయ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదం కోవిడ్ కాలంలో ప్రజలందరికీ చక్కగా ఉపయోగపడిందని, ఈ వైద్య విధానాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి ఆయుర్వేద వైద్యులకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీకి చెందిన అఖిల భారత ఆయుర్వేద మహాసమ్మేళనం, భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ, టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో శుక్రవారం మూడు రోజుల ఆయుర్వేద పర్వం -2023 కార్యక్రమం ప్రారంభమైంది. జెఈవో ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భారతీయ ఆయుర్వేదాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి సామాన్య ప్రజలకు చేరువ చేసేందుకు భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. శ్రీవారి ఆశీస్సులతో ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి నుండి ఆయుర్వేదం విస్తృతంగా వ్యాప్తి చెందాలని ఆకాంక్షించారు. స్వామివారు కొలువున్న శేషాచలం కొండల్లో అపూర్వమైన ఔషధ గుణాలున్న వనమూలికలు ఉన్నాయన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో 30 ఔషధాలను సొంతంగా తయారు చేస్తున్నట్టు చెప్పారు. మరిన్ని ఔషధాలకు లైసెన్సులు పొందేందుకు ఆయుష్ శాఖకు ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు.
తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రిలో మౌలిక వసతులు పెంచేందుకు చర్యలు చేపట్టామని జెఈవో తెలిపారు. ఇక్కడి ఆసుపత్రిలో పంచకర్మ చికిత్సకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు. కేరళలోని ఆయుర్వేద సంస్థలతో ఒప్పందం చేసుకుని ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతామని చెప్పారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాలతోపాటు ఇతర కళాశాలల్లో పరిశోధనలకు పెద్దపీట వేయాలని ఈ సందర్భంగా ఆయుష్ అధికారులను జెఈవో కోరారు. ఆయుర్వేద వైద్యం సమస్య మూలాల్లోకి వెళ్లి వ్యాధిని పూర్తిగా నయం చేస్తుందని తెలిపారు.
రుమాశాప్ పెయిన్ బామ్ ఆవిష్కరణ
నరసింగాపురంలోని శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో రుమాశాప్ పేరుతో టీటీడీ సొంతంగా తయారుచేసిన పెయిన్ బామ్‌ను ఈ సందర్భంగా జెఈవో ఆవిష్కరించారు. అదేవిధంగా, టీటీడీ ఎస్వీ ఆయుర్వేద కళాశాల అలూమినీ అసోసియేషన్ లోగోను జెఈవో ఆవిష్కరించారు. అంతకుముందు ఎస్వీ ఆయర్వేద కళాశాల, ఆయుష్ శాఖ ఇతర సంస్థలు ఏర్పాటుచేసిన ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి వైద్య విధానాలకు సంబంధించిన ప్రదర్శనశాలలను జెఈవో తిలకించారు.
ఈ కార్యక్రమంలో ఆయుష్ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ బిశ్వజిత్ కుమార్ సింగ్, రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠం ప్రెసిడెంట్ డా. దేవేందర్ త్రిగుణ, ఆయుష్ సలహాదారు డా. మనోజ్ నేసరి, ఎన్‌సిఐఎస్ఎం ఛైర్మన్ డా. జయంత్ డియోపూజారి, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డా. రేణుదీక్షిత్, అధ్యాపకులు డా. విజయభాస్కర్‌రెడ్డి, డా. రమేష్‌బాబు, డా.నారపరెడ్డి, డా. హర్షవర్ధన్, డా. శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.