YOGA AWARENESS TRAINING IN AYURVEDA COLLEGE _ ఆయుర్వేద కళాశాలలో యోగా అవగాహన కార్యక్రమాలు
ఆయుర్వేద కళాశాలలో యోగా అవగాహన కార్యక్రమాలు
తిరుపతి 19 జూన్ 2023: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో మూడు రోజుల అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు.
సోమవారం ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు యోగా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిపుణులు వివిధ యోగాసనాలను ప్రదర్శించి, విద్యార్థులతో చేయించారు. కార్యక్రమంలో ఆయుర్వేద కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ లక్ష్మీ నారాయణ, కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి నారాయణమ్మ, ఆయుర్వేద కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్ర కిషోర్ , ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు శ్రీ ముస్తాక్ అహ్మద్, శ్రీమతి విజయ శ్రీ పాల్గొన్నారు. విద్యార్థులు నిత్యజీవితంలో యోగ అభ్యాసం చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత, ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి సాధిం చడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.
TIRUPATI, 19 JUNE 2023: In connection with International Yoga Day on June 21, a three-day training programme was commenced by SV Ayurvedic College of TTD in SV Arts College on Monday.
Yoga experts taught Yoga Asans to students on the occasion.
Ayurvedic College vice principal Dr Sundaram, Arts College Principal Dr Narayanamma, National Sanskirt University Professor Dr Lakshmi Narayana and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI