ఆర్జితసేవలన్నీ టి.టి.డీ యథాతథంగానే కొనసాగిస్తుంది

ఆర్జితసేవలన్నీ టి.టి.డీ యథాతథంగానే కొనసాగిస్తుంది

తిరుమల, జనవరి -20, 2011: ఆర్జితసేవలగురించి వార్తలలో చాల అపోహలతో కూడిన వార్తలు వస్తున్నాయి. ఆర్జితసేవలన్నీ టి.టి.డీ యథాతథంగానే కొనసాగిస్తుంది. ఏ సేవ మూలవర్లకుగాని, ఉత్సవవర్లకు గాని రద్దు చేయడం లేదు. టిక్కెట్లవిషయంలో క్రమబద్ధీకరణకై కొన్నినిర్ణయాలుతీసుకోవడం జరిగింది. ఇవి ఏ తేది నుండి అమలు అయ్యేది, విధివిధానం త్వరలో విశదీకరిస్తాము. ప్రస్తుతానికి కరెంటుబుక్కింగ్‌ యథాతథంగా కొనసాగుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.