TTD CANCELS CONTRACTORS REGISTRATION _ ఆ కాంట్రాక్టర్ రిజిస్ట్రేషన్ రద్దు చేశాం – టీటీడీ

Tirupati, 26, April 2022: TTD on Tuesday has cancelled the contract of Tanigai Crafts Company belonging to Sri R Babu on grounds of violation of the terms and conditions.

In a statement, TTD said that it encourages registrations by multi companies to promote competitive biddings in the making of ornaments for Srivari temple and other TTD group of temples.

As part of the exercise, Sri Babu’s concern was also registered. It was found that it had violated the terms mentioned in GOMSNo.94 that it should hire only Hindu artisans and not Muslim artisans as per the agreement.

TTD action followed a complaint by Sri Venugopal of Balaji Metal Company that Babu concern had hired some Muslim artisans.

After a probe, TTD has cancelled the registration of Tanigai Crafts Company and also clarified that till now no work contract has been awarded to the said company.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

ఆ కాంట్రాక్టర్ రిజిస్ట్రేషన్ రద్దు చేశాం- టీటీడీ

తిరుపతి 26 ఏప్రిల్ 2022: టీటీడీ ఆభరణాల విభాగంలో తనిగై క్రాఫ్ట్స్ అనే సంస్థ పేరు మీద శ్రీ ఆర్.బాబు అనే వ్యక్తి చేసుకున్న రిజిస్ట్రేషన్ ను మంగళవారం రద్దు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

టీటీడీలో ఆభరణాల తయారీ తదితర అవసరాల కోసం కాంట్రాక్టర్ల మధ్య పోటీతత్వాన్ని పెంచి మెరుగైన ఫలితాల కోసం ఎక్కువ మంది కాంట్రాక్టర్లను రిజిస్టర్ చేసుకోవడం జరుగుతోంది. ఇందులో భాగంగానే శ్రీ బాబు
జిఓఎంఎస్ నెంబర్ 94 లోని నిబంధనలు, అర్హతలు, ఆధారాల మేరకు సంస్థ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాంట్రాక్టర్ ద్వారా పనిచేసే కార్మికులు కూడా హిందువులై ఉండాలని సదరు అగ్రిమెంట్ నిబంధనల్లో స్పష్టంగా పొందుపరచడం జరిగింది.

అయితే సదరు సంస్థ కాంట్రాక్టర్ ముస్లిం మతానికి చెందిన వారని, దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని తిరుపతికి చెందిన బాలాజి మెటల్ సంస్థకు చెందిన శ్రీ వేణుగోపాల్ టీటీడీకి ఫిర్యాదు చేశారు.

దీనిపై విచారణ జరిపి తనిగై క్రాఫ్ట్స్ సంస్థ రిజిస్ట్రేషన్ ను టీటీడీ రద్దు చేయడం జరిగింది. సదరు సంస్థకు ఇప్పటివరకు ఎలాంటి కాంట్రాక్టు ఇవ్వలేదని టీటీడీ స్పష్టం చేసింది.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.