ఈనెల 15వ తేదిన సూర్యగ్రహణం
ఈనెల 15వ తేదిన సూర్యగ్రహణం
తిరుమల, జనవరి – 08, 2011 : ఈనెల 15వ తేదిన సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఉదయం 5.30 గంటలకు మూసివేస్తారు. సూర్యగ్రహణం సందర్భంగా తిరుమలేశునికి నిత్యం నిర్వహించే ఉత్సవాలు, సేవలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. జనవరి 15వ తేది ఉదయం 12.05 గంటలకు సుప్రభాతం (ఏకాంతం) సేవ, నిత్యకట్ల కైంకర్యాలు, అభిషేకం పూర్తి చేస్తారు. వేకువజామున 3 నుంచి 5.00 గంటల వరకు భక్తులను సర్వదర్శనంకు అనుమతించి అనంతరం 5.30 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తారు. మధ్యాహ్నం 3.45 గంటలకు తిరిగి తెరచి శుద్ది, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.