ఈరోజు శ్రీవాణి టికెట్లు ఆఫ్ లైన్ లో జారీ
ఈరోజు శ్రీవాణి టికెట్లు ఆఫ్ లైన్ లో జారీ
తిరుమల, 2026 ఏప్రిల్ 11: సర్వర్ లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా రోజువారీ ఆన్ లైన్ లో జారీ చేసే శ్రీవాణి దర్శన టికెట్ల కోటా విడుదల వీలు పడలేదు.
ఈ కారణంగా ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల నుండి తిరుమలలోని అన్నమయ్య భవన్ కు ఎదురుగా ఉన్న శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ లో టికెట్లు జారీ చేయబడతాయి.
టికెట్ పొందిన భక్తులు సాయంత్రం 4 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
రోజువారీ కోటా అయిన 800 టికెట్లు పూర్తి అయ్యే వరకు మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ప్రాతిపదికన టికెట్లు జారీ చేస్తారు.
రేపటి నుండి యథావిధిగా శ్రీవాణి దర్శన కోటా ఆన్ లైన్ లో విడుదల చేయబడుతుంది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
