ఈ నెల 15వ తేదిన ”గోమహోత్సవ” సంబరాలు

ఈ నెల 15వ తేదిన ”గోమహోత్సవ” సంబరాలు

తిరుపతి, జనవరి -11, 2011: తిరుమల తిరుపతి దేవస్థానవముల శ్రీవేంకటేశ్వర గోసంరోక్షణశాల ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేది కనుమ పండుగ పర్వదినాన ”గోమహోత్సవ” సంబరాలు ఘనంగా జరుగుతాయి.
 
సకల దేవతా నిలయమైన గోవును పూజించడం మన హిందూ సాంప్రదాయం. ప్రతి ఏడాది కనుమ పండుగ రోజున తితిదే గోసంరక్షణశాలలో ఈ ఉత్సవం జరపడం ఆనవాయితి.
 
పశువులషెడ్లు దగ్గర దేవస్థానం వారిచే ఉంచబడిన బెల్లం, బియ్యం, పశుగ్రాసం వగైరాలను శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలకు విచ్చేయు భక్తులు స్వయంగా పశువులకు తినిపించు సదవకాశమును తితిదే వారు కనుమ పండుగ రోజున భక్తులకు కల్పించుచున్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకొని గోమాత మరియు స్వామివారి కృపకు పాత్రులుకాగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.