ఈ నెల 27వ తేది నుండి 29వ తేది వరకు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల 602వ జయంతి ఉత్సవాలు
ఈ నెల 27వ తేది నుండి 29వ తేది వరకు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల 602వ జయంతి ఉత్సవాలు
తిరుపతి, 2010 మే 20: శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తాగ్రేశుడైన శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల 602వ జయంతి ఉత్సవాలు ఈ నెల 27వ తేది నుండి 29వ తేది వరకు ఘనంగా జరుగుతాయి.
అన్నమయ్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతి, తాళ్ళపాకలలో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తాళ్ళపాక దగ్గరగల 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద 27వ తేది ఉదయం 5.30 నుండి సాయంత్రం 6.30 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వందలాది మంది కళాకారులచే సప్తగిరి సంకీర్తన గోష్ఠీగానం వైభవంగా జరుగుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.