ఉగాది ఏర్పాట్లపై టిటిడి తిరుపతి జెఈవో సమీక్ష
ఉగాది ఏర్పాట్లపై టిటిడి తిరుపతి జెఈవో సమీక్ష
తిరుపతి, 2019 మార్చి 19: శ్రీ వికారినామ సంవత్సరం ఉగాదిని ఏప్రిల్ 6వ తేదీ ఘనంగా నిర్వహించాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని జెఈవో నివాసంలో మంగళవారం సాయంత్రం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఉదయం నాదస్వరం, వేదస్వస్తి, పంచాంగ శ్రవణం నిర్వహించాలన్నారు. అనంతరం భక్తలకు ఉగాది విశిష్ఠతను తెలియచేయాలన్నారు. ప్రముఖ పండితులతో అష్ఠావధానం నిర్వహించాన్నారు. అనంతరం అహుతులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులకు, వారి పిల్లలకు క్విజ్, వ్యాసరచన , తదితర పోటీలు నిర్వహించాలన్నారు.
ఈ సమీవేశంలో డిపిపి కార్యదర్శి శ్రీ రమణప్రసాద్, డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత, శ్రీమతి భారతీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.