10% QUOTA IN TTD JUNIOR COLLEGES TO TTD EMPLOYEES KIDS AND SV BALAMANDIR STUDENTS TTD _ ఉద్యోగుల పిల్ల‌లు, ఎస్వీ బాల‌మందిరం విద్యార్థులకు టిటిడి జూనియర్ కళాశాలల్లో 10 శాతం కోటా

Tirupati, 06 July 2022: TTD has earmarked a 10% quota at all TTD Junior colleges for students of SV Balamandir and children of TTD employees in the academic year of 2022-23.

 

To claim their quota the TTD employees children and students of SV Balamandiram should upload their online applications by July 10.

 

The first phase of admissions will be completed from July 18-20 and that the classes for first year intermediate courses commences from July 23 onwards.

 

All applications should be uploaded on the TTD portal: admission.tirumala.org

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఉద్యోగుల పిల్ల‌లు, ఎస్వీ బాల‌మందిరం విద్యార్థులకు టిటిడి జూనియర్ కళాశాలల్లో 10 శాతం కోటా

తిరుపతి, 2022 జులై 06: తిరుప‌తిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌ల్లో 2022 – 23 విద్యా సంవత్సరానికి గాను ఇంట‌ర్మీడియెట్ కోర్సుల‌ ప్ర‌వేశాల్లో ఉద్యోగుల పిల్ల‌లు, ఎస్వీ బాల‌మందిరం విద్యార్థులకు క‌లిపి మొత్తం సీట్ల‌లో 10 శాతం కోటాను టిటిడి కేటాయించింది.

ఇందుకు గాను టిటిడి ఉద్యోగుల పిల్ల‌లు, ఎస్వీ బాల‌మందిరం విద్యార్థులు జులై 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మొద‌టి ద‌శ ప్ర‌వేశాలు జులై 18 నుండి 20వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. జులై 23వ తేదీ నుండి ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయి. admission.tirumala.org వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.