UPANISHADS IMPARTS TRUE VALUES OF EDUCATION _ ఉపనిషత్ సారమే నిజమైన విద్య : ఆచార్య రామసూర్యనారాయణ
TIRUMALA, 18 OCTOBER 2023: Renowned Sanskrit scholar Prof.Rama Surya Narayana said Upanishads imparts true values of education which are beneficial for a human being to lead a pious and peaceful life.
During his religious discourse on the Nada Neerajanam platform on Wednesday evening in the Veda Vidwat Sadas, he said, Bhagavat Gita is the essence of Upanishads. The Almighty Himself taught the Bhagavat Gita so that its essence reaches every human being to lead a life of ethics.
SVIHVS Special Officer Dr Vibhishana Sharma and others were present.
ఉపనిషత్ సారమే నిజమైన విద్య : ఆచార్య రామసూర్యనారాయణ
తిరుమల, 2023 అక్టోబరు 18: అభయాన్ని, అమృతత్వాన్ని, ఆనందాన్ని శాశ్వతంగా ప్రసాదించేవి ఉపనిషత్తులని, వీటిని అందరూ అధ్యయనం చేయాలని రాష్ట్రపతి పురస్కార గ్రహీత ఆచార్య రామసూర్యనారాయణ తెలిపారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని నానీరాజనం వేదికపై జరుగుతున్న శ్రీనివాస వేద విద్వత్ సదస్సులో బుధవారం ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆచార్య రామసూర్యనారాయణ “ఉపనిషత్తుల సందేశం” అనే అంశంపై ఉపన్యసిస్తూ ఉపనిషత్తుల సారంతో భగవద్గీత రూపొందిందన్నారు. మనం అధ్యయనం చేస్తున్నవన్నీ వృత్తి విద్యలేనని, నిజమైన విద్య ఆత్మానాత్మ వివేకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెప్పారు. శాశ్వతమైన అవధులు లేని ఆనందం ఉపనిషత్తుల అధ్యయనం ద్వారా కలుగుతుందన్నారు. ముందుగా చతుర్వేద పండితులు వేదపారాయణం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.