TTD EO INSPECTS DRY FLOWER TECHNOLOGY TRAINING CENTRE _ ఉపయోగించిన పుష్పాలతో చిత్ర పటాల తయారీ శిక్షణను పరిశీలించిన టీటీడీ ఈవో

Tirupati, 30 Sep. 21: TTD EO Dr KS Jawahar Reddy on Thursday viewed and reviewed the training for women in dry flower technology techniques to make portraits of Gods and other items from used flowers of all TTD sub-temples at the Citrus Research Institute located near Perur which commenced from September 28 onwards.

The EO personally took a look at how the flowers used in TTD temples are first dried then coloured and technology is used to stick them into various shapes and products. He saw how women made divine portraits and interacted with them.

He expressed his happiness over the scope and progress of the training program and made valuable suggestions to the YSR horticultural University officials conducting the training program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఉపయోగించిన పుష్పాలతో చిత్ర పటాల తయారీ శిక్షణను పరిశీలించిన టీటీడీ ఈవో

 తిరుపతి 30 సెప్టెంబరు 2021: టీటీడీ, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో దేవుళ్ళ చిత్ర పటాలు తయారు చేయడంపై మహిళలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గురువారం పరిశీలించారు.

పేరూరు సమీపంలోని చీని, నిమ్మ పరిశోధన కేంద్రంలో సెప్టెంబరు 28వ తేదీ ఈ శిక్షణ తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే.

టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలను తీసుకువచ్చి ఎలా ఎండబెడతారు. వాటి రంగు పోకుండా ఎలాంటి సాంకేతిక ను వాడతారు. పుష్పాలు ఎలా అతికిస్తారు. అనే విషయాలను ఈవో అడిగి తెలుసుకున్నారు. శిక్షణలోని మహిళలు తయారు చేసిన దేవతామూర్తుల చిత్రపటాలు చూశారు. మహిళలతో మాట్లాడి వారి అనుభవాలు తెలుసుకున్నారు. శిక్షణ సాగుతున్న తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారులకు పలు సూచనలు చేశారు.

జెఈవో శ్రీమతి సదా భార్గవి, విశ్వవిద్యాలయం అధికారులు డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ నాగరాజు, డిప్యూటీ ఈవో శ్రీ రమణ ప్రసాద్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది