TRAINING SHOULD BE EMPLOYMENT-ORIENTED – TTD JEO (HEALTH & EDUCATION – TTD JEO (H & E) _ ఎంప్లాయిమెంట్ జనరేట్ చేసే స్థాయిలో శిక్షణ ఉండాలి – టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్
Tirupati, 23 February 2026: The JEO (Health & Education) of Tirumala Tirupati Devasthanams, Dr. A. Sharath, instructed the faculty to provide quality training that enables students to secure employment opportunities at the Sri Padmavathi Women’s Polytechnic College in Tirupati.
On Monday, he inspected the college along with the concerned officials.
Addressing the faculty, the JEO emphasized the need to focus on career guidance, quality results, and employment generation, keeping in view the future of the students.
He stated that since it is a polytechnic institution, special attention should be given to strengthening technical skills and also suggested conducting regular career guidance programmes to enhance motivation and self-confidence among the students.
Later, he held a meeting with the faculty and directed them to bring to his notice the deficiencies and requirements of the institution.
The programme was attended by College Principal Dr. M. Padmavathamma, Additional Health Officer Dr. Sunil, EE Sri Prasad, DE Smt. Saraswathi, faculty members and staff.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఎంప్లాయిమెంట్ జనరేట్ చేసే స్థాయిలో శిక్షణ ఉండాలి – టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్
తిరుపతి, 2026, ఫిబ్రవరి 23: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులకు ఉద్యోగావకాశాలు సృష్టించే స్థాయిలో నాణ్యమైన శిక్షణ అందించాలని టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ అధ్యాపకులకు సూచించారు. సోమవారం ఆయన సంబంధిత అధికారులతో కలిసి కళాశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కెరీర్ గైడెన్స్, నాణ్యమైన ఫలితాలు, ఉపాధి అవకాశాల సాధన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. పాలిటెక్నిక్ కళాశాల కావడంతో సాంకేతిక నైపుణ్యాభివృద్ధి (టెక్నికల్ స్కిల్స్) పై మరింత శ్రద్ధ అవసరమని తెలిపారు. తరచూ కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థినుల్లో ప్రేరణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని చెప్పారు.
విద్యార్థినుల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలంటే అధ్యాపకులు సమిష్టిగా కృషి చేయాలని, నాణ్యమైన ఫలితాలు సాధించేందుకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఉత్తీర్ణత శాతం తగ్గితే సంబంధిత అధ్యాపకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అంతకుముందు జేఈవో కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, ప్రాక్టికల్ ల్యాబ్‌లు, తరగతి గదులను పరిశీలించి విద్యార్థినులతో ముచ్చటించారు. మైండ్ అటెన్షన్‌తో చదువుకుంటేనే ఉన్నత స్థాయి కెరీర్ సాధ్యమవుతుందని వారికి సూచించారు. టిటిడి నుంచి పూర్తి సహకారం అందుతోందని, అందుకు తగిన విధంగా ప్రతిభను కనబరచాలని విద్యార్థినులను కోరారు.
అనంతరం అధ్యాపకులతో సమావేశం నిర్వహించి కళాశాలలో ఉన్న లోటుపాట్లను తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డా. ఎం. పద్మావతమ్మ, అదనపు హెల్త్ ఆఫీసర్ డా. సునీల్, ఈఈ శ్రీ ప్రసాద్, డీఈ శ్రీమతి సరస్వతి, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.








