TTD TO PROVIDE FINANCIAL AID TO NCC PROGRAMS _ ఎన్.సి.సి కార్యక్రమాలకు టీటీడీ సహాయం
TIRUPATI, 22 JUNE 2023: TTD has decided to provide financial aid to NCC programs in its educational institutions.
To the proposal of JEO for Health and Education Smt Sada Bhargavi and with the intervention of DEO Sri Bhaskar Reddy, TTD EO Sri AV Dharma Reddy decided to fund NCC programs keeping in view the benefit of poor students.
NCC officers Sri Uday, Sri Ravi, senior cadets met JEO (H&E) in Administrative Building in Tirupati on Thursday evening and thanked her.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎన్.సి.సి కార్యక్రమాలకు టీటీడీ సహాయం
తిరుపతి, 22 జూన్ 2023: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల ఎన్.సి.సి కార్యక్రమాలకు టీటీడీ సొంత నిధులతో సహాయం చేయాలని నిర్ణయించింది. డీఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి చొరవతో జెఈవో శ్రీమతి సదా భార్గవి ప్రతిపాదన మేరకు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ సందర్భంగా డిఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఎన్.సి.సి ఆఫీసర్లు శ్రీ ఉదయ్, శ్రీ రవి, శ్రీ రమేష్, సీనియర్ క్యాడెట్లు గురువారం జేఈవో శ్రీమతి సదా భార్గవిని తిరుపతిలోని పరిపాలన భవనంలో కలసి కృతజ్ఞతలు తెలియజేశారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.