SVBC TO TELECAST LIVE SKVST KALYANOTSAVAM _ ఎస్వీబీసీలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం
ఎస్వీబీసీలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం
తిరుపతి, 2025 జనవరి 24: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే స్వామివారి కల్యాణాన్ని భక్తుల కోరిక మేరకు నెలలో ఒక రోజు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఇందులో భాగంగా జనవరి 25, ఫిబ్రవరి 1, మార్చి 22, ఏప్రిల్ 19, జూన్ 14, 28, జూలై 19, ఆగస్టు 30, సెప్టెంబరు 13, అక్టోబరు 11, నవంబరు 29, డిసెంబరు 13, 27వ తేదీలలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి నిత్య కల్యాణోత్సవాన్ని ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
సుదూర ప్రాంతాల నుండి శ్రీనివాసమంగాపురం రాలేని భక్తులు ఎస్వీబీసీలో స్వామివారి కల్యాణాన్ని వీక్షించాలని టీటీడీ కోరుతోంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.