ENHANCE THE REPUTATION OF SVBC WITH YOUR DEDICATED SERVICES-TTD EO _ ఎస్వీబీసీ విజయంలో ఉద్యోగులందరూ భాగస్వాములే : టిటిడి ఈఓ, ఎస్వీబీసీ ఎండి శ్రీఎవి.ధర్మారెడ్డి

14TH ANNIVERSARY OF THE TTD BHAKTI CHANNEL CELEBRATED

 SVBC TELECASTED 5000HOURS OF LIVE PROGRAMMES IN TWO YEARS

 TIRUPATI, 07 JULY 2022: Take the reputation of Sri Venkateswara Bhakti Channel to further heights with more dedication and efforts, said TTD EO Sri AV Dharma Reddy to the employees of SVBC.

During his address on the occasion of the 14th Anniversary of the reputed devotional channel in the SVBC Auditorium in Tirupati on Thursday evening, the EO said, even the Hindu Sanatana Dharma and scriptures taught us not to seek or wait for fruits of your labour. “If we discharge our responsibilities with dedication, the Supreme Lord Venkateswara will bless all of your and your families with health and happiness”, he maintained.

Briefing on the successful sojourn of the channel, the EO said, last two during the Corona period was very special towards the growth of the channel as almost every Telugu speaking household across the world and devotees of Srivaru watched the devotional and various Parayanam programmes on SVBC and made it as the top most Devotional Channel in the country. He wished that all the employees should continue their dedicated services and take the channel to further heights in future also.

TTD JEO(H & E) Smt Sada Bhargavi wished the employees for having completed 14 successful years by winning the hearts of devotees with unique Bhakti programmes. She said, the channel is acting as a main tool in the propagation of Hindu Santana Dharma activities taken up by TTD.

SVBC Chairman Dr Saikrishna Yachendra that there is no exaggeration to mention that the Channel reached its new heights especially in the last two years, with a wide range of devotional programmes under the stewardship of the present TTD EO and SVBC Managing Director Sri AV Dharma Reddy. The spiritual programmes, discourses he designed and telecasted live have casted a magic spell among global devotees.

Giving a brief report on the journey of SVBC with the help of a short video “Vijayapathamlo SVBC”, its CEO Sri Suresh Kumar said, in the last two years, SVBC has set a new record of having telecasted 5000 hours of live programmes by any spiritual channel in the country. “We could able to achieve this record with the determined team work of the employees. Even the SVBC Tamil, Kannada channels have been receiving overwhelming response from the respective audience while the team is working on popularizing Hindi channel also”, he maintained.

Earlier Sri Shanmukha Kumar who is set to assume the reigns as CEO SVBC, Sri Vijay Kumar, Advisor to the channel, Vedic Scholar Sri Seshacharylu also spoke on the occasion.

Later a few employees shared their experience on the occasion. The EO also felicitated retired and soon to retire employees of SVBC, winners in the competitions held to the workforce of the channel on the occasion.

All the top brass officials of SVBC from the Administrative perspective, Production, News, Technical and various other areas, women and men employees and their kin were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీబీసీ విజయంలో ఉద్యోగులందరూ భాగస్వాములే :  టిటిడి ఈఓ, ఎస్వీబీసీ ఎండి శ్రీఎవి.ధర్మారెడ్డి

తిరుపతి, 2022 జులై 07: ప్రజల్లో భక్తిభావాన్ని పెంచేలా కార్యక్రమాలను ప్రసారం చేయడంలో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ విజయం సాధించిందని, ఈ విజయంలో ఉద్యోగులందరూ భాగస్వాములేనని టిటిడి ఈఓ, ఎస్వీబీసీ ఎండి శ్రీఎవి.ధర్మారెడ్డి అన్నారు. ఎస్వీబీసీ 14వ వార్షికోత్సవం గురువారం రాత్రి తిరుపతిలోని జూ పార్క్ రోడ్ లోగల ఎస్వీబీసీ స్టూడియోలో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ బృంద నాయకుడిగా తాను పలురకాల సూచనలు చేశానని, సీఈవో శ్రీ సురేష్ కుమార్ నేతృత్వంలో ఉద్యోగులు నిబద్ధతతో పనిచేసి చక్కటి కార్యక్రమాలకు రూపకల్పన చేశారని కొనియాడారు. ఉద్యోగులు తమకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించడం ద్వారా ఛానల్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సత్కర్మలు చేయడం ద్వారా కుటుంబం, సమాజంలో మంచి పెంపొందుతుందన్నారు. పారాయణ కార్యక్రమాల ద్వారా భక్తులను లీనం చేసి భక్తి భావాన్ని పెంచడంలో ఎస్వీబీసీ సఫలీకృతమైందన్నారు.

ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ ఎస్వీబీసీ ప్రసారం చేసిన పారాయణ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక వికాసం కలిగిందన్నారు. అందరం కలిసి ఎస్వీబీసీని ఉన్నత శిఖరాలకు తీసుకెళదామని కోరారు.

టిటిడి జెఈఓ(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ సనాతన ధర్మ ప్రచారంతోపాటు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను వ్యాప్తి చేయడంలో ఛానల్ విశేషంగా కృషి చేస్తోందన్నారు. స్వామివారి వైభవాన్ని ఉత్తరాదిలోనూ వ్యాప్తి చేయాలని కోరారు.

ధర్మగిరి వేద పాఠశాల శాస్త్ర పండితులు శ్రీ శేషాచార్యులు మాట్లాడుతూ ఎస్వీబీసీ అనే యజ్ఞవేదిక ద్వారా టిటిడి ఒక యజ్ఞంలా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, తద్వారా విశ్వవ్యాప్తంగా భక్తిభావాన్ని పెంచుతోందని అన్నారు.

ఎస్వీబీసీ సీఈవో శ్రీ జి.సురేష్ కుమార్ వార్షిక నివేదికను అందించారు. అనంతరం నూతన సీఈఓ శ్రీ షణ్ముఖ కుమార్, ఎస్వీబీసీ సలహాదారు ఎస్.విజయ్ కుమార్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఇటీవల పదవీ విరమణ చేసిన సీనియర్ మేనేజర్ శ్రీ పద్మనాభ రావు, ప్రొడక్షన్ మేనేజర్ శ్రీ రమేష్ లను సన్మానించారు. అదేవిధంగా పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.