SV AYURVEDIC COLLEGE TO BE A CENTRE OF EXCELLENCE – TTD JEO (HEALTH AND EDUCATION) _ ఎస్వీ ఆయుర్వేద కళాశాలను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లాలి – టిటిడి జేఈవో (వైద్య, విద్య) డా. ఎ. శరత్
Tirupati, 10 February 2026: The TTD Joint Executive Officer for Health & Education, Dr. A. Sharath stated that the Sri Venkateswara Ayurvedic College functioning under TTD should be developed into one of the best Ayurvedic institutions in the country as a Centre of Excellency.
On Tuesday, he inspected the SV Ayurvedic College and its attached hospital.
Speaking on the occasion, the JEO emphasized that the college and hospital should provide quality education along with efficient healthcare services so as to gain national recognition as a premiere institution.
He stressed the need to popularize the significance and uniqueness of ancient Ayurveda among the present generation.
He also urged Ayurvedic doctors to undertake systematic research and emerge as a guiding force in the field.
The JEO H&E also stated that, as per the directives of the Honourable Chief Minister of AP Sri Nara Chandrababu Naidu, steps would be taken to identify issues in the institution and resolve them promptly.
He instructed the authorities to prepare a comprehensive report covering issues related to undergraduate and postgraduate students, infrastructure facilities, staffing, security and other related matters.
The JEO also called for encouraging students to take up innovative research in Ayurveda.
Earlier, Dr. Sharath interacted with the students and enquired about the problems they were facing.
He later held discussions with the teaching staff and offered several suggestions and directed the engineering officials to examine the requirements for construction of necessary buildings for students and submit a detailed report.
College Principal Dr. Renu Dixit briefed the JEO on the progress of the college and the day-to-day activities of the hospital.
SEs Sri Venkateswarlu and Sri Manoharam, EE Smt. Sumathi, teaching faculty of the college and other officials participated in the programme.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఎస్వీ ఆయుర్వేద కళాశాలను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లాలి – టిటిడి జేఈవో (వైద్య, విద్య) డా. ఎ. శరత్
తిరుపతి, 2026 ఫిబ్రవరి 10: టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలను దేశంలోనే అత్యుత్తమ కళాశాలగా తీర్చిదిద్దాలని టిటిడి జేఈవో (వైద్య, విద్య) డా. ఎ. శరత్ తెలిపారు. మంగళవారం ఆయన ఎస్వీ ఆయుర్వేద కళాశాల మరియు అనుబంధ వైద్యశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, కళాశాల మరియు వైద్యశాలలో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రాచీన ఆయుర్వేదంలోని విశిష్టతను నేటి తరానికి చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయుర్వేద వైద్యులు ప్రణాళికాబద్ధంగా పరిశోధనలు చేపట్టి మార్గదర్శకులుగా నిలవాలని కోరారు.
ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కళాశాలలోని సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల సమస్యలు, కళాశాల మౌలిక సదుపాయాలు, సిబ్బంది, భద్రత వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. విద్యార్థులు ఆయుర్వేదంలో నూతన పరిశోధనలు చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు.
అంతకుముందు ఆయన విద్యార్థులతో ముచ్చటించి, వారి సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బోధనా సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అవసరమైన భవనాల నిర్మాణానికి సంబంధించి ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. రేణు దీక్షిత్ కళాశాల పురోగతి, వైద్యశాలలో జరుగుతున్న రోజువారీ కార్యక్రమాలను జేఈవోకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహరం, ఈఈ శ్రీమతి సుమతి, కళాశాల బోధనా సిబ్బంది మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది



