ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
తిరుపతి, 2010 మే 25: శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ డిగ్రీ కళాశాల 2010-2011 విద్యా సంవత్సరానికి బి.ఎ, బి.కామ్, బి.ఎస్.సి మొదటి సంవత్సరం ప్రవేశం కొరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
దరఖాస్తులను ఈ నెల 26వ తేది నుండి ఎస్.వి ఆర్ట్స్ డిగ్రీ కళాశాల నందు 25 రూపాయలు చెల్లించి విద్యార్థులు పొందవచ్చును.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.