ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి 31 ఆగస్టు 2021: టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్ కళాశాలలో ప్రీ డిగ్రీ (ఇంటర్ ) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రెండేళ్ళ ప్రీ డిగ్రీ లో సంస్కృతం, తెలుగు, హిందీ కోర్సులకు 18 ఏళ్ళ లోపు వయసు కలిగి ఎస్సెస్సీ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన వారు అర్హులు. మూడేళ్ళ సంస్కృతం డిగ్రీ కోర్సుకు 21 సంవత్సరాల లోపు వయసు కలిగి ప్రీ డిగ్రీ, ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి.
కె.టి. రోడ్డు లోని కళాశాలల కార్యాలయంలో పనిదినములో రూ.25 చెల్లించి దరఖాస్తులు పొందవచ్చు. 4 – 10 – 2021 లోగా దరఖాస్తు సమర్పించాలి. ప్రవేశం లభించిన విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా ఉచితంగా హాస్టల్ సదుపాయం కల్పిస్తారు. ఇతర వివరాలకు 0877 – 2264604, 0877 – 2263974 , 94400 88315 నంబర్ల కు సంప్రదించవచ్చు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది