GOPUJA HELD _ ఎస్వీ గోశాలలో ఘనంగా గోపూజ మహోత్సవం
TIRUPATI, 15 JANUARY 2025: The Kanuma festival witnessed a grand celebration of Gopuja Mahotsavam in SV Gosala of TTD in Tirupati on Wednesday.
Special pujas were performed to Sri Venugopala Swamy in the temple while the cultural events began with Venu Ganam followed by Gobbemma Puja, Go-Gaja-Vrishabha-Aswa pujas on the auspicious occasion.
Dasa Sahitya, Annamacharya, HDPP artists presented Bhajans, Kolatams, Sankeertans.
The entire premises donned a colourful look with festoons and pandals, flower decorations matching the festival.
Later Prasadams were distributed to devotees.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ గోశాలలో ఘనంగా గోపూజ మహోత్సవం
తిరుపతి, 2025 జనవరి 15: తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో కనుమ పండుగ సందర్భంగా బుధవారం గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి వేణుగానం, 8 నుండి 9 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం జరిపారు. ఉదయం 8 నుండి 10.30 గంటల వరకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆతరువాత భక్తులకు శ్రీవేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేశారు . సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు అథితులు బహుమతులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.