LET US ALL PROTECT GOMATA-TTD EO _ గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం: టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు
GOKULASHTAMI PUJA HELD AT SV GOSHALA
Tirupati,27 August 2024: TTD EO Sri J Syamala Rao called upon for a revival of Sanatana Hindu dharma by protecting Gomata as revered in Vedas and Puranas.
He participated in the Gokulashtami Gopuja fete held at the TTD-run SV Go Samrakshanasala in Tirupati on Tuesday.
Speaking on the occasion he said Gow occupied a pivotal position in Hindu Dharma where by worshipping Gomata people promoted agricultural prosperity in the country. He said TTD also facilitated jaggery, rice and fodder for devotees to feed the Gomata at Goshala.
Tirupati MLA Sri Srinivasulu said worship of Gomata is crucial for the agricultural prosperity of the country and called upon TTD to lead the Gopuja campaign.
Earlier EO performed puja for Gomata and Sri Venugopala Swamy.
Earlier special Abhishekam, Venuganam, Veda pathanam, bhajans, Kolata and Annamacharya sankeertans were performed.
Thereafter cultural programs by SPWDPG girl students and Harikatha by artists of HDPP enthralled the devotees.
JEO Smt Gautami, CVSO Sri Sridhar, Gosala Director Dr Harnath Reddy were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం : టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు
• ఎస్వీ గోశాలలో ఘనంగా గోకులాష్టమి ‘గోపూజ’
తిరుపతి, 2024 ఆగస్టు 27 : వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకుని, సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు పిలుపునిచ్చారు.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో మంగళవారం గోకులాష్టమి గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉందన్నారు. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారని, తద్వారా పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందన్నారు. గో శాలలో పశువుల షెడ్ల వద్ద ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పించిందని వివరించారు.
అనంతరం తిరుపతి ఎంఎల్ఏ శ్రీ శ్రీనివాసులు మాట్లాడుతూ, గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు టిటిడి గోపూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. గోశాలలో గోకులాష్టమి గోపూజకు చాల ప్రాదాన్యత ఉందన్నారు. గోవును పూజించడం వలన పాడిపంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా వుంటుందని తెలిపారు.
అంతకుముందు ఈవో దంపతులు గో పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంతకుముందు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, వేణుగానం, ఎస్వీ వేదపాఠశాల విద్యార్థులతో వేదపఠనం, భజనలు, కోలాటం, అన్నమాచార్య సంకీర్తనాలాపన నిర్వహించారు. తరువాత ఎస్‌పిడబ్ల్యు విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం హిందూ ధర్మప్రచార పరిషత్ కళాకారులతో హరికథ వినిపిస్తారు.
ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీమతి గౌతమి, సివిఎస్వో శ్రీ శ్రీధర్, గోశాల సంచాలకులు డా|| కె.హరనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.