ఎస్వీ జూనియర్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ఎస్వీ జూనియర్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి, జూన్ 06, 2013: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులు సమర్పించేందుకు జూన్ 15ను చివరి తేదీగా నిర్ణయించారు.
ఈ కళాశాలలో ఎంపిసి, బైపిసి, ఎంఇసి, సిఇసి, హెచ్‌ఇసి, హెచ్‌టిసి, జిఇహెచ్ గ్రూపులు ఉన్నాయి. దూరప్రాంత విద్యార్థుల(బాలురకు మాత్రమే)కు మాత్రమే మెరిట్ ఆధారంగా కళాశాల హాస్టల్‌లో నిర్ణీత సంఖ్యలో ప్రవేశం కల్పిస్తారు. తిరుపతి, పరిసర ప్రాంత విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు(తక్షణ ప్రవేశాలు) జరుగుతున్నాయి. కళాశాలలో అన్ని వసతులతో కూడిన ప్రయోగశాలలు, విజ్ఞానాన్ని పెంచుకోవడానికి అధునాతన గ్రంథాలయం అందుబాటులో ఉన్నాయి. శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు నిష్ణాతులైన గురువులున్నారు. సహ పాఠ్య ప్రణాళికల్లో భాగంగా ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇతర వివరాల కోసం కళాశాల కార్యాలయ పనివేళల్లో 0877-2264595 నంబరులో సంప్రదించాలని ప్రిన్సిపాల్ శ్రీ వై.రత్నరాజు కోరారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.