ఎస్వీ ప్రత్యేక ప్రతిభావంతుల పాలిటెక్నిక్ కళాశాలలో ప్రదేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
ఎస్వీ ప్రత్యేక ప్రతిభావంతుల పాలిటెక్నిక్ కళాశాలలో ప్రదేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
తిరుపతి, జూలై-11, 2008: తిరుమల తిరుపతి దేవస్థానమువారు వికలాంగులకు ప్రత్యేకముగా ఈ విద్యా సంవత్సరము ఒక పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించినారు. దీనికి ”శ్రీవేంకటేశ్వర పాలిటెక్నిక్ ఫర్ ఫిజికలీ చాలెంజ్‌ర్” అని నామకరణం చేసినారు. ఈ పాలిటెక్నిక్ కళాశాలను, ఈ విద్యాసంవత్సరము శ్రీపద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల తిరుపతి ప్రాంగణములో నిర్వహించుచున్నారు.
ఈ పాలిటెక్నిక్‌లో మూడు సంవత్సరముల వ్యవధి గల డిప్లమా ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, డిప్లమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ మరియు డిప్లమా ఇన్ గార్మంట్ టెక్నాలజీ కోర్సులలో చేరుటకు అఖరు తేది. 19-7-2008 అని ఆ కళాశాల ఫ్రిన్సిపల్ I/c శ్రీరెడ్డివారిభాస్కర్‌రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తిగల వికలాంగులు (మహిళలు మరియు పురుషులు) నేరుగా ఫ్రిన్సిపల్‌గారిని 15-7-2008 లోపు సంప్రదించవచ్చును.
తిరుమల తిరుపతి దేవస్థానంవారు వీరికి (వికలాంగులు) ఉచిత విద్య, ఉచిత వసతి, మరియు ఉచిత భోజన సౌకర్యములు కలుగజేస్తున్నారు. ఈ కోర్సులో చేరుటకు కనీస విద్యార్హత 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండవలెను.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.