ఎస్వీ బథిరుల పాఠశాల్లో ప్ర‌వేశాలకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

ఎస్వీ బథిరుల పాఠశాల్లో ప్ర‌వేశాలకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

తిరుపతి, 2010 మే 27: తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నడపబడుతున్న బథిరుల పాఠశాలల్లో 2010-2011 విద్యాసంవత్సరానికి బథిర విద్యార్థుల నుంచి దరఖాస్తునులను కోరడమైనది.


తిరుపతి, వరంగల్‌, భీమవరంలలో గల తితిదేకు చెందిన బథిర పాఠశాలలో మే 5వ తేది నుండి దరఖాస్తులను విక్రయిస్తున్నారు. మే 31వ తేది లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవలసి వుంటుంది. తిరుపతిలో దరఖాస్తు చేసుకొన్నవారికి జూన్‌ నెల 21వ తేది నుండి 22వ తేది వరకు రెండు రోజుల పాటు ఇంటర్యూలు  నిర్వహిస్తారు.

భీమవరంలో దరఖాస్తు చేసుకొన్న వారికి జూన్‌ నెల 23వ తేది నుండి 24వ తేది వరకు రెండు రోజులు ఇంటర్యూలు నిర్వహిస్తారు. అదేవిధంగా వరంగల్‌లో దరఖాస్తు చేసుకొన్న వారికి జూన్‌ నెల 25వ తేది నుండి 26వ తేది వరకు ఇంటర్యూలు నిర్వహిస్తారు. ఈ ఇంటర్యూలు ఆయా ప్రాంతాలలో నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.