COMPLETE SV MUSEUM DEVELOPMENT WORKS ON SCHEDULE- EO SINGHAL _ ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
Tirumala, 25 November 2019: TTD Executive Officer Sri Anil Kumar Singhal instructed officials to complete all development works in SV Museum on Schedule.
He reviewed the Museum works at TTD Annamaiah Bhavan on Monday morning where the M/s Map Technologies who were developing a virtual reality 3D augmentation made a power point presentation on the ongoing works.
The development activities of the Museum is divided into Zone-1 to Zone-6.
Zone-1 comprised of Golla Mandapam, Mahadwaram, Tula Bharam, and Ranganayakula Mandapam, Dwaja stambham, Vendi Vakili, temple rooftop, Pillars and their architecture.
Zone-2 included Swami Pushkarani and other surroundings of Srivari temple.
Zone-3 has Bangaru Vakili, Garuda Alwar, garbhalayam, vakulamata Sannidhi, yagasala, vimana Venkateswara, Bashyakarlu, Sri Yoga Narasimha, Sri Varadaraja, Potu, Kalyana mandapam etc.
While in Zone-4, Vahanams utilised during Srivari Brahmotsavams, Pallaki and other puja material.
In Zone-5, Srivari sevas from suprabatham to ekantha seva, daily rituals and in Zone-6 Thirthas in sapthagiri, significance and natural beauty, arrangements to highlight their wonderful shape and environs.
After the power point presentation the EO said the zone wise development works once completed, will enhance the devotional quotient of Tirumala and spiritually enthrall the devotees
CE Sri Ramachandra Reddy, Museum in charge and SE 2 Sri Nageswar Rao, EE Subramanyam, Museum curator Sri Shivakumar and others participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
తిరుమల, 2019 నవంబరు 25: తిరుమలలోని ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం ఉదయం మ్యూజియం అభివృద్ధి పనులపై బెంగళూరుకు చెందిన మాప్ టెక్నాలజీస్ సంస్థ వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
శ్రీవారి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించిన అనుభూతి పొందేలా వర్చువల్ రియాలిటి 3డి ఆగుమెంటేషన్ టెక్నాలజీతో మ్యూజియంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టిన విషయం విదితమే.
ఈ సందర్భంగా వారు దశల వారిగా మ్యూజియంను ఏవిధంగా అభివృద్ధి చేస్తారనే విషయాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు తెలియజేశారు. ప్రతిపాదిత మ్యూజియం అభివృద్ధికి జోన్-1, జోన్-2, జోన్-3, జోన్-4, జోన్-5, జోన్-6గా విభజించారు.
ఇందులో జోన్-1లో గొల్లమండపం, మహద్వారం, తులాభారం, రంగనాయకుల మండపం, ధ్వజస్తంభం, వెండివాకిలి, ఆలయ పైకప్పు, స్తంభాలు, వాటిపై ఉన్న శిల్పా సౌందర్యం, జోన్-2లో ఆలయ నాలుగు మాడ వీధులు, పుష్కరిణి, ఆలయ పరిసరాలు తదితర వాటితో రూపొందిస్తున్నారు.
జోన్ -3లో బంగారు వాకిలి, గరుడాళ్వార్, గర్భాలయం, వకుళామాత సన్నిధి, యాగశాల, విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్లు, శ్రీ యోగనరసింహస్వామి, శ్రీ వరదరాజస్వామి, పోటు, కల్యాణమండపం తదితర ప్రదేశాలను వీక్షించేలా చర్యలు చేపట్టారు. జోన్-4లో శ్రీవారి వాహన సేవలలో ఉపయోగించిన వాహనాలు, వాహనసేవలు, పల్లకీలు, ఇతర పూజ సామాగ్రిల విశిష్టత తెలుసుకునేలా ఏర్పాటు చేయనున్నారు.
జోన్-5లో శ్రీవారికి ఉదయం సుప్రభాతం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు నిర్వహించే సేవలు, నిత్య కైంకర్యాలు, జోన్-6లో సప్తగిరులలోని తీర్థాలు – వాటి విశిష్టత, ప్రకృతి సౌదర్యం – అందులోని అద్భుతాలను తెలుసుకునేలా ఏర్పాట్లు చేపట్టారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ఈవో మాట్లాడుతూ జోన్‌ల వారిగా విభజించిన పనులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా ఏక్కువ మంది భక్తులు మ్యూజియంను సందర్శించి, ఆధ్యాత్మిక ఆనందం పొందుతారాన్నారు.
ఈ కార్యక్రమంలో సిఇ శ్రీ రామచంద్రారెడ్డి, మ్యూజియం ఇన్‌చార్జ్ అధికారి మరియు ఎస్‌ఇ శ్రీ నాగేశ్వరరావు, ఇఇ శ్రీ సుబ్రమణ్యం, మ్యజియం క్యూరేటర్ శ్రీ శివకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.