SRI KALA BHAIRAVA HOMAM PERFORMED _ ఎస్వీ వేద విశ్వ విద్యాలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ హోమం
Tirupati, 22 Dec. 20: As part of Dhanurmasa fete mulled by TTD Sri Kalabhairava Homam was performed in SV Vedic University on Tuesday.
Vice-Chancellor Sri Sudarshana Sharma, CEO SVBC Sri Suresh Kumar, faculty and students participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ వేద విశ్వ విద్యాలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ హోమం
తిరుపతి, 2020 డిసెంబరు 22: మాసాలలోకి అత్యున్నతమైన మార్గశిర మాసంలో తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం కాలభైరవ హోమం శాస్తోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ మాట్లాడుతూ కాల భైరవుడు శివుడి రూపమని, అన్ని శివాలయాలకు క్షేత్ర పాలకుడని తెలిపారు. ఈ హోమంలో పాల్గొన్న, చూసిన ఆర్థిక స్థితి మెరుగు పడటమే గాకా సమయ పాలన, నైపుణ్యాభివృద్ధి పెంపొంది, చెడు కర్మల నుండి విముక్తులవుతారని వివరించారు.
అనంతరం శ్రీ కాలభైరవ స్వామివారి హోమం నిర్వహించారు.
ఈ పూజ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్, వేద విశ్వ విద్యాలయం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.