APPLICATIONS INVITED FOR SVITSA _ ఎస్వీ సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Tirupati, 28 May 2022: TTD has invited applications for 2022-23 academic year for all courses at Sri Venkateswara Institute of Traditional Sculpture and Architecture College from June 1-10.

In a statement, the TTD said students could procure applications for diploma and certificate courses and apply by the evening of June 17.

All students selected for diploma courses will get ₹ 1 lakh which is deposited in their bank accounts after their selection

For more details on courses, qualifications and others interested persons shall log onto TTD website www.tirumala.org or contact the office in the working days during office hours on 0877-2264637.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఎస్వీ సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి, 2022 మే 28: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2022-23 విద్యాసంవత్సరానికి గాను డిప్లొమా, సర్టిఫికేట్‌ కోర్సు (సంప్రదాయ కళంకారి కళ)లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరడమైనది. కళాశాలలో జూన్ 1 నుండి 10వ తేదీ వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 17వ తేదీ సాయంత్రంలోపు కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది.

డిప్లొమా కోర్సులో చేరిన విద్యార్థిని విద్యార్థులకు ఒక లక్ష రూపాయలు చొప్పున బ్యాంకులో డిపాజిట్‌ చేసి ఉత్తీర్ణత సాధించిన అనంతరం నిబంధనలకు లోబడి చెల్లిస్తారు. కోర్సులు, విద్యార్హతలు, ఇతర వివరాల కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ, కళాశాల కార్యాలయాన్ని 0877-2264637 నంబరులో గానీ సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.