ఎస్‌జిఎస్ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ (హోటల్‌మేనేజ్‌మెంట్ ) కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
ఎస్‌జిఎస్ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ ( హోటల్‌మేనేజ్‌మెంట్ ) కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
తిరుపతి, 2010 జూన్ 10: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో గత ఏడాది బిఎస్సీ – ”క్యాటరింగ్, టూరిజం మరియు హోటల్‌మేనేజ్‌మెంట్” కోర్సులను ప్రారంభించారని ఆ కళాశాల ఫ్రిన్సిఫాల్ డాక్టర్ నాగేంద్రసాయి ఒక ప్రకటనలో తెలియజేసారు.
కోర్సు వివరాలు:
కోర్సు పేరు : బిఎస్సీ – ”క్యాటరింగ్, టూరిజం, హోటల్‌మేనేజ్‌మెంట్”
మీడియం : ఇంగ్లీషు మీడియం
కోర్సువ్యవధి : మూడు సంవత్సరాలు
అర్హత : సైన్స్‌లో ఇంటర్ పూర్తి చేసి లేదా హోటల్ మెనేజ్‌మెంట్
ఒకేషనల్‌కోర్సు పూర్తిచేసి ఉండాలి.
మొత్తం సీట్లు : 40
ఫీజు : రూ.6,616/-
ప్రైవేటు కళాశాలల్లో ఈకోర్సు పూర్తి చేయడానికి దాదాపు లక్షా యాభైవేలు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ సంవత్సరానికి ఏడు వేలు మించి అవదు. ఒకటిన్నర లక్ష రూపాయలు వెచ్చించి బయట ఈ కోర్సు చేయలేని ప్రతిభ గల పేద విద్యార్థులకు ఇదొక మంచి అవకాశము.
ఈ కోర్సును అభ్యసించిన ప్రతి విద్యార్థికి వంథాతం ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సింగపూర్, మలేషియా, దుబాయ్ వంటి దేశాల్లోనేగాక మనదేశంలో ఎయిర్ లైన్స్, రైల్వే, పర్యాటక శాఖ తదితర రంగాల్లో ఉద్యోగం పొందవచ్చు. ఈ కోర్సు పూర్తయిన తరువాత ఎంబిఏలో టూరిజం, హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేస్తే ప్రారంభ జీతంగానే దాదాపు 50 వేల నుండి 60 వేల రూపాయలు తీసుకోవచ్చు.
గమనిక : పై కోర్సులో మూడు సంవత్సరాల డిప్లొమా చేసినవారు, ఈ డిగ్రీ కోర్సు ద్వితీయ సంవత్సరములో చేరుటకు అర్హులు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.