REVIEW MEETING HELD _ ఏప్రిల్ 15న ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు
VONTIMITTA, 09 APRIL 2022: TTD Additional EO Sri AV Dharma Reddy held a review meeting with the district Collector of YSR Kadapa Sri Vijayarama Raju on Saturday over the Sri Rama Navami Brahmotsavam arrangements at Vontimitta.
The Additional EO said almost all the arrangements at Kalyana Vedika were completed and all the officers concerned will discuss the arrangements every day and all the final works will be completed by April 14. He said the Srivari Sevaks will distribute food, water, buttermilk, Talambralu and special devotional cultural programmes have been arranged on the big day on April 15.
Collector said as the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy is expected to take part in the celestial marriage of Sri Sita Rama Kalyanam fool proof security arrangements should be made to avoid any untoward incident and an MPDO will be deployed at each gallery near Kalyana Vedika. He also briefed on the traffic regulation plan, parking facilities, transportation through RTC buses etc.
JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CE Nageswara Rao, and other officers were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 15న ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు
– భక్తులందరికీ తలంబ్రాలు అందేలా చూస్తాం
– టిటిడి ఆదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
– జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష
ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 09 : ఏకశిలానగరంగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో వద్ద ఏప్రిల్ 15వ తేదీన శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులందరికీ తలంబ్రాలు అందేలా చర్యలు తీసుకున్నామని టిటిడి ఆదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. కల్యాణం ఏర్పాట్లపై శనివారం టిటిడి కళ్యాణ మండపం సమీపంలోని సమావేశపు హాలులో వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్పీ శ్రీ అన్బురాజన్ తో కలిసి టిటిడి అధికారులు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈఓ మాట్లాడుతూ కల్యాణం ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగంతో రెండోసారి సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. కల్యాణవేదిక వద్ద పనులు దాదాపు పూర్తయ్యాయని, ప్రతిరోజూ అధికారుల కమిటీ సమావేశమై ఏర్పాట్లపై చర్చిస్తారని తెలిపారు. ఏప్రిల్ 14వ తేదీ నాటికి ఏర్పాట్లు మొత్తం పూర్తవుతాయన్నారు. పార్కింగ్ ప్రదేశాలు, విద్యుత్ అలంకరణలు, బ్యారీకేడ్లు, ప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలందిస్తామన్నారు. కల్యాణం రోజు సాయంత్రం 5 గంటలకు ఆలయం నుండి స్వామి, అమ్మవారు ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు చేరుకుంటారని తెలిపారు. అక్కడ భక్తులను ఆకట్టుకునేలా అన్నమయ్య సంకీర్తనలు, త్యాగరాజ సంకీర్తనలు, తమిళనాడుకు చెందిన శ్రీ విఠల్‌దాస్ మహరాజ్ బృందం నామసంకీర్తనం నిర్వహిస్తామన్నారు. టిటిడి విజిలెన్స్ అధికారులు, పోలీసుల సమన్వయంతో పటిష్ట భద్రత నడుమ కల్యాణాన్ని విజయవంతంగా నిర్వహిస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ ఈ నెల 15న జరిగే రాములవారి కల్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వచ్చే అవకాశముందని, ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భద్రతా ఏర్పాట్లు చేపడతామన్నారు. కల్యాణవేదిక ముందు ఏర్పాటుచేసిన ప్రతి గ్యాలరీకి ఇంఛార్జిగా ఒక ఎంపిడివో ను నియమిస్తామన్నారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్ ఏర్పాట్లు చేపడతామన్నారు.
ఈ సమావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్ కుమార్, ఎస్ఇ(ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈఓలు శ్రీ గోవిందరాజన్, డా. రమణప్రసాద్, శ్రీ లక్ష్మణ్ నాయక్, విజిఓ శ్రీ మనోహర్, అదనపు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సునీల్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.