SPECIAL FESTIVALS IN APRIL AT TIRUCHANOOR SRI PADMAVATHI AMMAVARI TEMPLE AND ASSOCIATED TEMPLES _ ఏప్రిల్ నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆలయాలలో విశేష ఉత్సవాలు

At Tiruchanur Sri Padmavathi Ammavari Temple

  • On April 10, 17, and 24 (Fridays), the Tiruchi Utsavam will be held at 6:00 PM
  • On April 11, on the occasion of Uttarashada Nakshatram, the Goddess will bless devotees by parading on the Gaja Vahanam (Elephant vehicle) around the temple streets at 6:45 PM.
  • From April 30 to May 2, the annual Vasanthotsavam (Spring Festival) will be celebrated.

•  As part of this, Koil Alwar Tirumanjanam will be held on April 28, and Ankurarpanam on April 29.

At Sri Sundararaja Swamy Temple

•  On April 16, on the occasion of Uttarabhadra Nakshatram, the Lord will parade at 7:00 PM.

At Sri Balaramakrishna Swamy Temple

•  On April 21, on the occasion of Rohini Nakshatram, Tiruchi Utsavam will be held at 7:00 PM for Sri Krishna Swamy.

At Sri Suryanarayana Swamy Temple

•  On April 29, on the occasion of Hasta Nakshatram, Tiruchi Utsavam will be held at 5:00 PM.

At Sri Srinivasa Swamy Temple

•  On April 04, 11, 18, and 25 (Saturdays), Abhishekam will be performed at 8:00 AM.

At Appalayagunta Sri Prasanna Venkateswara Swamy Temple

•  On April 07 (Tuesday), Ashtadala Padapadmaradhana Seva will be performed at 8:00 AM.

  • On April 10, 17, and 24 (Fridays), Vastralankarana Seva and Abhishekam will be performed at 7:00 AM.

•  On April 08, Ashtottara Shata Kalashabhishekam will be performed at 8:00 AM.

•  On April 12, Kalyanotsavam will be held at 10:30 AM.

•  On April 05, 12, 19, and 26, Abhishekam will be performed for Sri Anjaneya Swamy.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI     
 

ఏప్రిల్ నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆలయాలలో విశేష ఉత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం….

  ఏప్రిల్ 10, 17, 24 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చి ఉత్సవం.

  ఏప్రిల్ 11న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గం.లకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

  ఏప్రిల్ 30 నుండి మే 02వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు, వసంతోత్సవం సందర్భంగా ఏప్రిల్ 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఏప్రిల్ 29న అంకురార్పణ

శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో

ఏప్రిల్ 16న ఉత్తరాభద్ర నక్షత్రం సందర్భంగా తిరుచ్చిపై సాయంత్రం 7 గం.లకు స్వామి వారు విహరిస్తారు.

శ్రీ బలరామకృష్ణ స్వామి ఆలయంలో..

  ఏప్రిల్ 21న రోహిణి నక్షత్రం సందర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 7 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.

శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో..

  ఏప్రిల్ 29 తేదీన హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.

శ్రీ శ్రీనివాస స్వామి ఆలయంలో..

ఏప్రిల్ 04, 11, 18, 25 తేదీలలో శనివారం ఉదయం 8 గం.లకు స్వామివారికి అభిషేకం.

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో

  ఏప్రిల్ 07న మంగళ వారం ఉదయం 8 గం.లకు అష్టదళ పాదపద్మారాధన సేవ.

  ఏప్రిల్  10, 17, 24 వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం.

  ఏప్రిల్ 08న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం.

  ఏప్రిల్ 12న ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం

  ఏప్రిల్ 05, 12, 19, 26 తేదీలలో శ్రీ ఆంజనేయ స్వామి మూలవర్లకు అభిషేకం.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.