APRIL MONTH SPECIAL FESTIVALS IN TIRUCHANOOR _ ఏప్రిల్ నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆలయాలలో విశేష ఉత్సవాలు
Tirupati, 26 March 2025: In the month of April, many special festivals will be held in Tiruchanoor Sri Padmavati Ammavaru and related sub-Temples. Their details are as follows.
– Trichy Utsavam will be held on April 4, 11, 18 and 25 at 6 pm on every Friday.
– On the occasion of Uttarashada Nakshatram on April 21 at 6.45 in the evening, Amma varu will ride the Gaja Vahanam
– On April 3 and 30, Trichy Utsavam will be held for Sri Krishna Swamy on the occasion of Rohini Nakshatra at 6 pm.
– On the occasion of Hasta Nakshatra on April 12, Trichy Utsavam will be conducted for Sri Suryanarayana Swami at 5 pm.
ఏప్రిల్ నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆలయాలలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2025 మార్చి 26: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
• ఏప్రిల్ 4, 11, 18, 25వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
• ఏప్రిల్ 21న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
శ్రీ బలరామకృష్ణ స్వామి ఆలయంలో..
– ఏప్రిల్ 3, 30వ తేదీలలో రోహిణి నక్షత్రం సందర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.
శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో..
– ఏప్రిల్ 12న హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.