CHANDRAGIRI RAMALAYAM BRAHMOTSAVAMS _ ఏప్రిల్ 1న చంద్ర‌గిరి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

CHANDRAGIRI RAMALAYAM BRAHMOTSAVAMS
 
Tirupati, 29 March 2025:. The annual Brahmotsavam in the ancient temple of Sri Kodanda Ramalayam in Chandragiri will be observed from April 06 to 14 with Ankurarpanam on April 05.
 
Koil Alwar Tirumanjanam will be observed on April 01 in connection with the annual Brahmotsavam.
 
The HDPP is organising devotional cultural programmes every day during the annual fest.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 1న చంద్ర‌గిరి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2025 మార్చి 29: చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీన‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా ఏప్రిల్ 1న‌ తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.