TWELTH PHASE SUNDARAKANDA AKHANDA PATHANAM ON APRIL 10 _ ఏప్రిల్ 10న 12వ విడత సుందరకాండ అఖండ పారాయణం
Tirumala, 4 April 2021: The 12th phase of Sundarakanda Akhanda Pathanam is fixed on April 10 at Nada Neerajana Mandapam in Tirumala which will be telecasted live on SVBC for the sake of global devotees between 7am and 9am on Sunday.
To enrich the cultural, moral, social, religious and philosophical thoughts of the people particularly among the youth and the programme has been receiving accolades from all corners.
So far TTD has successfully conducted 11 Akhanda Parayanams
In the 12th phase, 155 Shlokas from Chapters 49 to 53 of Sundarakanda will be recited and nearly 200 Vedic scholars from Dharmagiri Veda Vignana Peetham, Vedic University, National Sanskrit Varsity, SV Higher Vedic Studies, Veda Parayanamdars will participate in this mass recitation of Sundarakanda.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఏప్రిల్ 10న 12వ విడత సుందరకాండ అఖండ పారాయణం
తిరుమల, 2021 ఏప్రిల్ 04: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఏప్రిల్ 10వ తేదీ శనివారం 12వవిడత సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది.
ఇందులో భాగంగా ఉదయం 7 గంటల నుండి సుందరకాండలోని 49వ సర్గ నుంచి 53వ సర్గ వరకు ఉన్న 155 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయణంలో పాల్గొంటారు. కాగా ఇప్పటివరకు టిటిడి 11 విడతల్లో అఖండ పారాయణాన్ని విజయవంతంగా నిర్వహించింది.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ఉదయం 7 నుండి 9 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.