SRI RAMA NAVAMI FESTIVITIES AT SRI KRT _ ఏప్రిల్ 10 నుండి శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు

Tirupati, 08 April 2022: TTD is organising grand festivities of Sri Rama Navami utsavam at Sri Kodandaramaswami temple from April 10 onwards.

The festivities includes Abhisekam, Asthanam, and Hanumanta vahana Seva on the First day.

On April 11 Muthyala Talambralu procession from the TTD building takes place followed by the celestial Sri Sitaram Kalyanam and Thiruveedhi Utsavam. Devotee couples could participate in Kalyanam with ₹1000 ticket.

On April 12 Chaturdasha Kalasha Snapana Tirumanjanam will be conducted followed by Sri Rama Pattabhisekam at night and devotees on payment of  ₹1000 per ticket (two people allowed) shall participate in the fete.

On April 13, Khanija Tototsavam will be observed.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 10 నుండి శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు

 తిరుప‌తి, 2022 ఏప్రిల్ 08: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 10వ తేదీ నుండి శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా మొదటిరోజు ఉదయం శ్రీరామనవమి సందర్భంగా మూలవర్లకు అభిషేకం, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీరామనవమి ఆస్థానం వైభవంగా నిర్వ‌హిస్తారు. రాత్రి 8 గంటలకు హనుమంత వాహనంపై రాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

ఏప్రిల్ 11న శ్రీ సీతారాముల కల్యాణం

ఏప్రిల్ 11వ‌ తేదీ సోమవారం ఉద‌యం 8 గంట‌లకు టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నం నుండి ఏనుగుపై ముత్యాల త‌లంబ్రాల ఊరేగింపు జ‌రుగ‌నుంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం వేడుకగా నిర్వ‌హిస్తారు. రూ.1000/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. ఆ తరువాత తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్ 12న ఉదయం స్వామివారికి చతుర్దశ కలశ స్నపనతిరుమంజనం, రాత్రి 7 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. రూ.1000/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి గృహస్తులు శ్రీ‌రామ‌ప‌ట్టాభిషేకంలో పాల్గొనవచ్చు. ఏప్రిల్ 13వ తేదీన ఖ‌నిజ తోట ఉత్సవం జరుగనుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.