UGADI CELEBRATIONS AT MAHATHI AUDITORIUM ON APRIL 13 _ ఏప్రిల్ 13న మహతిలో ఉగాది సంబరాలు
Tirupati 25 March 2021: Under the joint supervision of HDPP and the Welfare department, TTD is organising the Sri Sharvari Nama Samvatsaram Ugadi celebrations on April 13 at the Mahati auditorium in full adherence to COVID-19 guidelines.
Prominent scholar Sri Bala Subramaniam Shastri will render the Panchanga Sravanam in the celebrations, which begin at 09; 30 hours.
Thereafter TTD employees children will be presented prizes for their performances at the dress competitions which will be followed by cultural programs.
The festive highlight of Ugadi Pachadi distribution will also be held later on.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఏప్రిల్ 13న మహతిలో ఉగాది సంబరాలు
తిరుపతి, 2021 మార్చి 25: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శార్వరినామ సంవత్సర ఉగాది వేడుకలు ఏప్రిల్ 13వ తేదీ తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరుగనున్నాయి. కోవిడ్ – 19 నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఉదయం 9.30 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా శ్రీ బాలసుబ్రమణ్యం శాస్త్రీ పంచాంగ శ్రవణం చేస్తారు.
అనంతరం టిటిడి ఉద్యోగుల పిల్లలతో వేషధారణ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం ఉగాది పచ్చడి ప్రసాద వితరణ ఉంటుంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.