ఏప్రిల్ 14న టిటిడి పరిపాల భవనంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 119వ జయంతి
ఏప్రిల్ 14న టిటిడి పరిపాల భవనంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 119వ జయంతి
తిరుపతి, 2010 ఏప్రిల్ 13: తిరుమల తిరుపతి దేవస్థానముల ఎస్.సి/ఎస్.టి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 119వ జయంతి ఉత్సవాలు ఏప్రిల్ 14వ తేదిన స్థానిక తితిదే పరిపాల భవనం నందు ఘనంగా జరుగుతాయి.
ఈ కార్యక్రమంలో తితి దేవస్థానముల పాలకమండలి అధ్యకక్షులు డి.కె. ఆదికేశవులు, కార్యనిర్వహణ అధికారి ఐ.వై.ఆర్. కృష్ణారావు, సంయుక్త కార్యనిర్వహణ అధికారి ఎన్. యువరాజు, ప్రత్యేకాధికారి ఎ.వి. ధర్మారెడ్డి ఇతర అధికారులు సిబ్బంది పాల్గొంటారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.