ఏప్రిల్ 14న డా. బీ.ఆర్.అంబేద్కర్  135వ జయంతి ఉత్సవం 

ఏప్రిల్ 14 డా. బీ.ఆర్.అంబేద్కర్  135 జయంతి ఉత్సవం 

తిరుపతి, 2026, ఏప్రిల్ 12: భారత రాజ్యాంగ శిల్పి మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  135 జయంతి ఉత్సవాలను ఏప్రిల్ 14వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు.  

ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం 10 గంటలకు తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రారంభమవుతుంది.  ఈ సందర్భంగా డా.బీ.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలు ఘటించి, ఆయన ఆశయాలను స్మరించుకోనున్నారు.  

ఈ కార్యక్రమంలో టిటిడిలో పనిచేస్తున్న అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొననున్నారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.