ఏప్రిల్‌ 18 నుండి కేరళలో శ్రీనివాస కల్యాణాలు

ఏప్రిల్‌ 18 నుండి కేరళలో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, ఏప్రిల్‌ 16, 2013: తిరుమల శ్రీవారికి అత్యంత ప్రియభక్తుడైన కులశేఖర ఆళ్వార్‌ జన్మించిన కేరళ రాష్ట్రంలో మొట్టమొదటసారిగా తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 18వ తేదీ నుండి  మూడు చోట్ల శ్రీనివాస కల్యాణాలు వైభవంగా జరుగనున్నాయి.

ఇందులో భాగంగా ఏప్రిల్‌ 18న తొరవూర్‌లో తొరవూర్‌ మహాక్షేత్ర భక్తజన సమితి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణాన్ని కన్నులపండుగగా నిర్వహించనున్నారు. కేరళ శ్రీవారి సేవ ట్రస్టు ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 20న కొచ్చిలో, ఏప్రిల్‌ 21న త్రిశూర్‌ జిల్లాలోని కొడంగలూరులో శ్రీవారి కల్యాణం వైభవంగా జరుగనుంది. శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్‌ కె.రామకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.