‌DHWAJA STHAMBHA SAMPROKSHANAM _  ఏప్రిల్ 2 నుండి 4వ తేదీ వ‌ర‌కు శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో నూత‌న‌ ధ్వజస్తంభం సంప్రోక్ష‌ణ‌

TIRUPATI, 31 MARCH 2025: Dhwaja Sthambha Samprokshana programmes will take place in Appalayagunta from April 2 to 4.

Ankurarpanam for the ritual will be observed on April 01.

Everyday there will be Vaidika Programs in Yagasala and on April 04 Maha Purnahuti will be observed between 9:30am and 10:30am.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 2 నుండి 4వ తేదీ వ‌ర‌కు శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో నూత‌న‌ ధ్వజస్తంభం సంప్రోక్ష‌ణ‌

తిరుపతి, 2025 మార్చి 31: అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో ఏప్రిల్ 2 నుండి 4వ తేదీ వ‌ర‌కు నూత‌న‌ ధ్వజస్తంభం సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు శాస్త్రోక్తంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఏప్రిల్ 1న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అంకురార్పణ నిర్వహించ‌నున్నారు.

ఇందులో భాగంగా ఏప్రిల్ 2న ఉద‌యం 8 నుండి 11.15 గంట‌ల వ‌ర‌కు వైదిక కార్య‌క్ర‌మాలు, వాస్తుహోమం, సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వరకు కళాపకర్షణ నిర్వ‌హించ‌నున్నారు. ఏప్రిల్ 3న ఉద‌యం 8.15 నుండి 11 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు జీవ ధ్వజస్తంభ మ‌హా శాంతి అభిషేకం, పూర్ణాహూతి జ‌రుగ‌నుంది.

ఏప్రిల్ 4న ఉద‌యం 7.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, ఉద‌యం 9.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు మ‌హా పూర్ణాహూతి, కుంభ ప్రోక్ష‌ణ శాస్త్రోక్తంగా నిర్వ‌హించ‌నున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.