SRIVARI VASANTHOTSAVAM FROM APRIL 24-26 _ ఏప్రిల్ 24 నుండి 26వ తేదీ వరకు ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

ఏప్రిల్ 24 నుండి 26వ తేదీ వరకు ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల, 23 ఏప్రిల్‌ 2021: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 24 నుండి 26వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ ఉత్సవాలను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. ఈ కార‌ణంగా రెండో రోజు నిర్వ‌హించే స్వ‌ర్ణ ర‌థోత్స‌వాన్ని టిటిడి ర‌ద్దు చేసింది.

వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను స్వామికి నివేదిస్తారు.

ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ‌మండ‌పంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంట‌ల‌కు స్వామి, అమ్మ‌వార్ల‌ను ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేప‌డ‌తారు. మొద‌టి రెండు రోజులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి, మూడో రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులకు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, ఊరేగింపు నిర్వ‌హిస్తారు.

ఈ ఉత్స‌వాల కార‌ణంగా మూడు రోజుల పాటు క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala, 23 Apr. 21: TTD is organising a three-day grand celebration of the annual Vasantothsavam at Srivari Temple from April24-26 in ekantham in view of Covid guidelines.

Traditionally the festival is conducted in the spring season wherein Sri Malayappa Swami is worshipped with abundant budding flowers and an assortment of fruits offered as naivedyam.

The highlights of the festival conducted during the Chaitra Shudda pournami are – 1) daily Snapana thirumanjanam for utsava idols of Sri Malayappa Swami and his consorts in the morning and 2) Asthanam and 3) procession on Mada streets in the evening.

On the first two days, the utsava idols of Sri Malayappa and consorts were offered Snapana thirumanjanam and procession. But on the third day the all the Parivar devatas of Sri Sita Rama Lakshmana and Anjaneya along with Rukmini and Sri Krishna are also offered Snapana thirumanjanam and procession.

As part of festivities, the TTD has cancelled the arjita sevas of Kalyanotsavam, Unjal Seva, arjita Brahmotsavam, and Sahasra Deepalankara seva on all three days.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI