”HARIDHRA GHATANAM” ON APRIL 03 IN VONTIMITTA _ ఏప్రిల్ 3న ” హరిధ్రా ఘటనం” తో ఒంటిమిట్ట శ్రీరాముని కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం
VONTIMITTA/TIRUMALA, 29 MARCH 2025: Haridhra Ghatanam – the traditional pounding of turmeric roots will be performed in the Sri Kodandarama temple premises, at Vontimitta in YSR Kadapa district on April 03.
It is a tradition in Hindu marriages to prepare turmeric powder to give auspicious bath to both the bride and bridegroom before entering into the wedlock.
The turmeric powder thereby obtained will be used in the celestial Sita Rama Kalyanam on April 11 which will be observed between 6:30pm and 8:30pm at Kalyana Vedika in Vontimitta.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఏప్రిల్ 3న ” హరిధ్రా ఘటనం” తో ఒంటిమిట్ట శ్రీరాముని కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2025 మార్చి 29: ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవాలు ఏప్రిల్ 3న ”హరిధ్రా ఘటనం”తో అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి.
ఇందులో భాగంగా గురువారం ఉదయం గర్భాలయం లోపల పసుపు కొమ్ములకు, రోళ్ళు, రోకళ్లకు స్వామి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని పసుపు కొమ్ములను పోసి సాంప్రదాయ బద్దంగా రోలులో దంచనున్నారు. తద్వారా శ్రీ సీతా రామ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లు ప్రారంభమవుతాయి.
పసుపు దంచే కార్యక్రమంలో వచ్చిన పసుపును ఉత్సవరులకు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో తలంబ్రాల తయారీకి ఉపయోగిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది