SRI BHAGAVAD RAMANUJACHARYA AVATARA MAHOTSAVAMS FROM APRIL 30 TO MAY 2 _ ఏప్రిల్ 30 నుంచి మే 2వ తేదీ వరకు శ్రీ భగవద్‌ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు

TIRUPATI, 29 APRIL 2025: The Alwar Divya Prabandha Project of TTD is organizing Sri Bhagavad Ramanujacharya Avatara Mahotsavams from April 30 to May 2 at Annamacharya Kalamandiram in Tirupati.

As part of the three-day celebrations, literary discourses and devotional music programs dedicated to Sri Ramanujacharya will be conducted every evening from 6 PM to 8:30 PM.

The festival will commence on April 30 at 5:30 PM with the blessings of Tirumala Sri Sri Sri Pedda Jeeyar Swami and Sri Sri Sri Chinna Jeeyar Swami. 

This will be followed by a discourse by Acharya Chakravarthi Ranganathan on the topic “Sri Ramanujacharya Vaibhavam”. 

Later, Sri K. Saraswati Prasad and team from Annamacharya Project will present a devotional music program.

On May 1 at 6 PM, Dr. K.T.V. Raghavan from will deliver a lecture on “Sri Ramanujacharya – The Essence of Sri Vaishnavism”, followed by a Harikatha presentation by Sri Venkateswarlu, faculty member of SV College of Music and Dance.

On May 2 at 6 PM, Sri K.E. Lakshmi Narasimhan of Tirupati will speak on “Sri Ramanujacharya and Tirumala Kainkaryams”. 

The event will conclude with a devotional music performance by Smt. R. Bullemma and team from Annamacharya Project.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

ఏప్రిల్ 30 నుంచి మే 2వ తేదీ వరకు శ్రీ భగవద్‌ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు

తిరుప‌తి, 2025 ఏప్రిల్ 29: అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 30 నుంచి మే 2వ తేదీ వరకు శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు జరుగనున్నాయి.

ఈ సంద‌ర్బంగా మూడు రోజుల పాటు సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ భగవద్‌ రామానుజాచార్యులపై సాహితీ స‌ద‌స్సు, సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి మంగ‌ళాశాస‌నాల‌తో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం తిరుప‌తికి చెందిన ఆచార్య చ‌క్ర‌వ‌ర్తి రంగనాథన్‌ ” శ్రీ రామానుజాచార్ల వైభవం” పై ఉపన్యసిస్తారు. త‌రువాత తిరుప‌తికి చెందిన శ్రీ కె. స‌ర‌స్వ‌తి ప్ర‌సాద్‌ బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.

మే 1న సాయంత్రం 6 గంట‌ల‌కు తిరుప‌తికి చెందిన‌ డా.కె.టి.వి.రాఘ‌వ‌న్ ” శ్రీ రామానుజాచార్యులు – శ్రీ వైష్ణ‌వ‌త‌త్వం ” పై ప్ర‌సంగిస్తారు. త‌రువాత ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు హ‌రిక‌థ గానం చేస్తారు. మే 2న సాయంత్రం 6 గంట‌ల‌కు తిరుప‌తికి చెందిన శ్రీ కె.ఇ. ల‌క్ష్మీన‌ర‌సింహ‌న్ ” శ్రీ రామానుజాచార్యులు – తిరుమ‌ల కైంక‌ర్యాలు ” అనే అంశంపై ఉపన్యసిస్తారు. అనంత‌రం శ్రీ‌మ‌తి ఆర్. బుల్లెమ్మ బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.