RAMANUJACHARYA AVATARA MAHOTSAVAM FROM APRIL 30 TO MAY 2 _ ఏప్రిల్ 30 నుంచి మే 2వ తేదీ వరకు శ్రీ భగవద్‌ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు

Tirupati, April 23, 2025: TTD is organising a three-day Sri Ramanujacharya Avatara Mahotsavam will be held from April 30 to May 2 under the auspices of TTD Alwar Divya Prabandha Project at Annamacharya Kalamandiram.

As part of the festivities, a literary conference and musical programs on Sri Bhagavad Ramanujacharya will be organised for three days from 6 pm to 8.30 pm.

The Mahotsavam will begin at 5.30 pm on April 30 with the Mangalasasanas of Tirumala Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy and will be followed by speeches by several dignitaries and devotional music programs.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

ఏప్రిల్ 30 నుంచి మే 2వ తేదీ వరకు శ్రీ భగవద్‌ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు

తిరుప‌తి, 2025 ఏప్రిల్ 23: అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 30 నుంచి మే 2వ తేదీ వరకు శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు జరుగనున్నాయి.

ఈ సంద‌ర్బంగా మూడు రోజుల పాటు సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ భగవద్‌ రామానుజాచార్యులపై సాహితీ స‌ద‌స్సు, సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి మంగ‌ళశాస‌నాల‌తో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం పలువురు ప్రముఖుల ఉపన్యాసాలు, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.