ఏప్రిల్‌ 5న శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం

ఏప్రిల్‌ 5న శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం

తిరుపతి, ఏప్రిల్‌ 04, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ ఐదో తేదీ శుక్రవారం వార్షిక పుష్పయాగం వైభవంగా జరుగనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విధంగానే ఇక్కడ పుష్పయాగం నిర్వహించనున్నారు.

శుక్రవారం ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.45 గంటల నుండి 5.00 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా జరుగనుంది. ఇందులో మల్లె, సంపంగి, జాజి, రోజా తదితర రకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. రాత్రి 6.00 గంటలకు ఊంజల్‌ సేవ అనంతరం రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
రూ.516/- చెల్లించి పుష్పయాగంలో పాల్గొనే గృహస్తులకు(ఇద్దరు) రవికె, ఉత్తరీయం బహుమానంగా అందించనున్నారు. ఇటీవల శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో దొర్లిన చిన్న చిన్న పొరబాట్లను నివృత్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.