ఏప్రిల్ 5 నుండి 10వ తేదీ వ‌ర‌కు ఎస్వీ ఆయుర్వేదిక్‌ ఆసుపత్రిలో మెడికల్‌ ఎడ్యుకేషన్‌పై అవ‌గాహ‌ణ‌

ఏప్రిల్ 5 నుండి 10వ తేదీ వ‌ర‌కు ఎస్వీ ఆయుర్వేదిక్‌ ఆసుపత్రిలో  మెడికల్‌ ఎడ్యుకేషన్‌పై అవ‌గాహ‌ణ‌

తిరుపతి, 2010ఏప్రిల్  03: తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీవేంకటేశ్వర ఆయుర్వేదిక్‌ ఆసుపత్రి, కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన ఆయుష్‌ విభాగముల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 5వ తేది నుంచి 10వ తేది వరకు స్థానిక యస్‌.వి. ఆయుర్వేదిక్‌ ఆసుపత్రినందు కంటిన్యూడ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (సి.ఎం.ఇ) కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేశంలోని పలువురు ప్రముఖులు పాల్గొంటారు.

ఈ సందర్భంగా ఏఫ్రిల్‌ 5వ తేదిన ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమ ప్రారంభ సమావేశం ఆయుర్వేద ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహిస్తారు.

ఈ కార్యమ్రంలో తితిదే జె.ఇ.ఓ. డాక్టర్‌ యువరాజు, తితిదే చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శారద, స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంగమ్మ తదితరులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.