BTU OF VALIMIKIPURAM TEMPLE FROM APRIL 6-14 _ ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వ‌ర‌కు వాల్మీకిపురం శ్రీ ప‌ట్టాభిరామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

Tirupati, 04 April 2022: TTD is organising the annual Brahmotsavam of Sri Pattabhiramaswamy temple at Valmikipuram from April 6-14 with Ankurarpanam on April 5.

As part of the festivities Sri Sita Kalyanotsavam will be performed on April 7 in which devotee couples shall participate with 500 ticket.

On April 15, TTD is organizing Snapana Tirumanjanam and Pushpa Yagam.

 The artists of the HDPP and Annamacharya project will perform Dharmic and Cultural programs respectively during Brahmotsavams.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వ‌ర‌కు వాల్మీకిపురం శ్రీ ప‌ట్టాభిరామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

 తిరుపతి, 2022 ఏప్రిల్ 04: టిటిడికి అనుబంధంగా ఉన్న వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వ‌ర‌కు జరుగనున్నాయి. ఏప్రిల్ 5వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమ‌వుతాయి.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, రవికె, లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఆలయంలో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు :

తేదీ                                                 ఉదయం                     రాత్రి

06-04-2022(బుధ‌వారం)      ధ్వజారోహణం(మేష ల‌గ్నం), గజవాహనం

07-04-2022(గురువారం)   ముత్యపుపందిరి వాహనం, హనుమంత వాహనం

08-04-2022(శుక్ర‌వారం)       కల్పవృక్ష వాహనం, సింహ వాహనం

09-04-2022(శ‌నివారం)      సర్వభూపాలవాహనం, పెద్దశేష వాహనం

10-04-2022(ఆదివారం)      సూర్యప్రభ వాహనం, చంద్రప్రభవాహనం, మోహినీ అవతారం

11-04-2022(సోమ‌వారం)          తిరుచ్చి ఉత్సవం, కల్యాణోత్సవం, గరుడ వాహనం

12-04-2022(మంగ‌ళ‌వారం)         రథోత్సవం, ధూళి ఉత్సవం

13-04-2020(బుధ‌వారం)         తిరుచ్చి ఉత్సవం, అశ్వవాహనం, పార్వేట ఉత్సవం

14-04-2022(గురువారం)      వసంతోత్సవం, చక్రస్నానం, హంస వాహనం, ధ్వజావరోహణం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.