ఏప్రిల్ 8వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో వృద్ధులు, దివ్యాంగులకు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్లు

ఏప్రిల్ 8వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో వృద్ధులు, దివ్యాంగులకు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్లు

తిరుమల, 2022 ఏప్రిల్ 07: వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టోకెన్ల కోటాను ఏప్రిల్ 8వ తేదీన శుక్రవారం ఉద‌యం 11 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. సాఫ్ట్‌వేర్‌లో ఏర్ప‌డిన సాంకేతిక స‌మ‌స్య వ‌ల్ల ఏప్రిల్ 1వ తేదీకి బ‌దులుగా ఏప్రిల్ 8వ తేదీకి ద‌ర్శ‌న టోకెన్ల‌ను వాయిదా వేశారు.

రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేస్తారు. ఏప్రిల్ 9వ తేదీ నుండి నిర్దేశించిన స్లాట్‌లో వీరిని ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో రెండేళ్ల త‌రువాత వృద్ధులు, దివ్యాంగుల ప్ర‌త్యేక ద‌ర్శ‌నాన్ని టిటిడి పున‌రుద్ధ‌రించింది.

కాగా, వీరిని ప్ర‌తిరోజూ ఉద‌యం 10 గంట‌ల స్లాట్‌లో దివ్యాంగుల క్యూలైన్ ద్వారా ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. శుక్ర‌వారం నాడు మాత్రం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స్లాట్ కేటాయించారు. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైనది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.